నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను
దేవతల యెదుట నిన్ను కీర్తించెదను
I will praise thee with my whole heart: before the gods will I sing praise unto thee.
2 నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను
నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు
నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను I will worship toward thy holy temple, and praise thy name for thy loving kindness and for thy truth: for thou hast magnified thy word above all thy name.
3 నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి
నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి
In the day when I cried thou answeredst me, and strengthenedst me with strength in my soul.
4 యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
All the kings of the earth shall praise thee, O LORD, when they hear the words of thy mouth.
5 యెహోవా మహా ప్రభావముగలవాడని
వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు
Yea, they shall sing in the ways of the LORD: for great is the glory of the LORD.
6 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును
ఆయన దూరమునుండి గర్విష్టులను బాగుగా ఎరుగును
6Though the LORD be high, yet hath he respect unto the lowly: but the proud he knoweth afar off.
7 నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రతికించెదవు
నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు
నీ కుడిచేయి నన్ను రక్షించును
Though I walk in the midst of trouble, thou wilt revive me: thou shalt stretch forth thine hand against the wrath of mine enemies, and thy right hand shall save me.
8 యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును
యెహోవా, నీ కృప నిరంతరముండును
నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.
The LORD will perfect that which concerneth me: thy mercy, O LORD, endureth for ever: forsake not the works of thine own hands.