Showing posts with label కీర్తనల గ్రంథము. Show all posts
Showing posts with label కీర్తనల గ్రంథము. Show all posts

Thursday, April 22, 2010

కీర్తనలు 33వ అధ్యాయము

లీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనందగానము చొయుడి
స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము
2్ సితారాతో యెహోవాను స్తుతించుడి
పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
3్ ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి
ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి
4యెహోవా వాక్యము యథార్థమైనది
ఆయన చేయునదంతయు నమ్మకమైనది
5ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు
అఓకము యెహోవా కృపతో నిండియున్నది
6యెహోవా వాక్కుచేత ఆకాశము కలిగెను
ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెని.
7సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే
అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే
8లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను
భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను
9ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను
ఆయన ఆజ్ఞాపింపగానగాకార్యము స్థిరపరచబడెను
10అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును
జనముల యోచనలు ఆయన నిష్పలములుగా జేయును
11యెహోవా ఆలోచన సదా కాలము నిలుచును
ఆయన సంకల్పములు తరతరములకు ఉండును
12యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు
ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు
13 యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు
ఆయన నరులందరిని దృష్టించుచున్నాడి
14తానున్న నివాసస్థలములో నుండి
భూలోక నివాసులందరివైపు ఆయన చూచు చున్నాడు
15ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు
వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించువాడు
16ఏ రాజును సేవాబలముచేత రక్షింపబడడు
ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు
17 రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు
అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింపజాలదు
18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును
కరవులో వారిని సజీవులుగా జాపాడుటకును
19యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను
ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది
20మనము యెహోవా పరిశుద్ధనామందు నమ్మికయుంచియున్నాము
ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది
21మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునైయున్నాడు
Psalm 33

1Rejoice in the LORD, O ye righteous: for praise is comely for the upright.

2Praise the LORD with harp: sing unto him with the psaltery and an instrument of ten strings.

3Sing unto him a new song; play skilfully with a loud noise.

4For the word of the LORD is right; and all his works are done in truth.

5He loveth righteousness and judgment: the earth is full of the goodness of the LORD.

6By the word of the LORD were the heavens made; and all the host of them by the breath of his mouth.

7He gathereth the waters of the sea together as an heap: he layeth up the depth in storehouses.

8Let all the earth fear the LORD: let all the inhabitants of the world stand in awe of him.

9For he spake, and it was done; he commanded, and it stood fast.

10The LORD bringeth the counsel of the heathen to nought: he maketh the devices of the people of none effect.

11The counsel of the LORD standeth for ever, the thoughts of his heart to all generations.

12Blessed is the nation whose God is the LORD; and the people whom he hath chosen for his own inheritance.

13The LORD looketh from heaven; he beholdeth all the sons of men.

14From the place of his habitation he looketh upon all the inhabitants of the earth.

15He fashioneth their hearts alike; he considereth all their works.

16There is no king saved by the multitude of an host: a mighty man is not delivered by much strength.

17An horse is a vain thing for safety: neither shall he deliver any by his great strength.

18Behold, the eye of the LORD is upon them that fear him, upon them that hope in his mercy;

19To deliver their soul from death, and to keep them alive in famine.

20Our soul waiteth for the LORD: he is our help and our shield.

21For our heart shall rejoice in him, because we have trusted in his holy name.

22Let thy mercy, O LORD, be upon us, according as we hope in thee.

Wednesday, April 21, 2010

కీర్తనలు 32వ అధ్యాయము

తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు
తన పాపమునకు ప్రయశ్చిత్తము నొదినవాడు ధన్యుడు
2యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు
ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు
3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన
నా యెముజలు క్షీణించినవి
4దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను
నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను (సెలా)
5నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని
యెహోవా సన్నిధిని నా అతిక్తమములు ఒప్పుకొందుననుకొంటిని

నీవు నా దోషములను పరిహరించియున్నావు (సెలా)
6కావున నీ దర్శనకాలమందు భక్తిగవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు
విస్తార జలప్రవహములు పొరలివచ్చినను
నిశ్చయముగా అవి వారిమీదికి రావు
7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
8నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను
నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
9బుద్ది జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిదవలెనైనను మీరు ఉండకుడి
అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటినోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను
10భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి
యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది
11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లసించుడి
యథార్థ హృదయులారా, మీరందరు ఆనందముగానము చేయుడి
Psalm 32

1Blessed is he whose transgression is forgiven, whose sin is covered.

2Blessed is the man unto whom the LORD imputeth not iniquity, and in whose spirit there is no guile.

3When I kept silence, my bones waxed old through my roaring all the day long.

4For day and night thy hand was heavy upon me: my moisture is turned into the drought of summer. Selah.

5I acknowledge my sin unto thee, and mine iniquity have I not hid. I said, I will confess my transgressions unto the LORD; and thou forgavest the iniquity of my sin. Selah.

6For this shall every one that is godly pray unto thee in a time when thou mayest be found: surely in the floods of great waters they shall not come nigh unto him.

7Thou art my hiding place; thou shalt preserve me from trouble; thou shalt compass me about with songs of deliverance. Selah.

8I will instruct thee and teach thee in the way which thou shalt go: I will guide thee with mine eye.

9Be ye not as the horse, or as the mule, which have no understanding: whose mouth must be held in with bit and bridle, lest they come near unto thee.

10Many sorrows shall be to the wicked: but he that trusteth in the LORD, mercy shall compass him about.

11Be glad in the LORD, and rejoice, ye righteous: and shout for joy, all ye that are upright in heart.

Thursday, November 26, 2009

కీర్తనలు 31వ అధ్యాయము Psalm 31

కీర్తనలు 31వ అధ్యాయము
యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను
నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము
నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము
2నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము
నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను
ప్రాకారముగల యిల్లుగాను ఉండును
3నాకొండ నా కోట నీవే
నీ నామమునుబట్టి త్రోవచూపి నన్ను నడిపించుము
4నా ఆశ్రయదుర్గము నీవే
నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్దిన వలలోనుండి నన్ను తప్పించుము
5నా ఆత్మను ని చేతికప్పగించుచున్నాను
యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే
6నేను యెహోవాను నమ్ముకొనియున్నాను
వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు
7నీవు నా బాధను దృష్టించియున్నావు
నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు
కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను
8నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు
విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి
9యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము
విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది
నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి

10నా బ్రతుకు దుఖఃముతో వెళ్ళబుచ్చుచున్నాను
నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి
నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది
నా యెముకలు క్షీణించుచున్నవి
11నా శత్రువులందరికి నేను వివాదాస్పదుడనై యున్నాను
నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను
నా నెళవరులకు భీకరుడనై యున్నాను
వీధిలో నన్ను చూచువారు నా యెదుటనుండి పారిపోవుదురు
12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని
ఓటికుండవంటి వాడనైతిని
13అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నాను
నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు
వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది
నలుదిశలను నా కు భీతి కలుగుచున్నది
14యెహోవా, నీయందునమ్మిక యుంచియున్నాను
నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను
15నా కాలగతులు నీ వశములో నున్నవి
నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము
నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము
16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము
నీ కృపచేత నన్ను రక్షింపుము
17యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గునొందనియ్యకుము
భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక
18అబద్దికుల పెదవులు మూయబడును గాక
వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు
19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది
నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది
20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు
వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
21ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను
ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు
ఆయన స్తుతినొందును గాక
22భీతిచెందినవాడనై-నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని
అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా
నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి
23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి
యెహోవా విశ్వాసులను కాపాడును
గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును
24యెహోవాకొరకు కనిపెట్టువారలారా,
మీరందరు మనస్సున ధైరయము వహించి నిబ్బరముగా నుండుడి
10నా బ్రతుకు దుఖఃముతో వెళ్ళబుచ్చుచున్నాను
నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి
నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది
నా యెముకలు క్షీణించుచున్నవి
11నా శత్రువులందరికి నేను వివాదాస్పదుడనై యున్నాను
నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను
నా నెళవరులకు భీకరుడనై యున్నాను
వీధిలో నన్ను చూచువారు నా యెదుటనుండి పారిపోవుదురు
12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని
ఓటికుండవంటి వాడనైతిని
13అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నాను
నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు
వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది
నలుదిశలను నా కు భీతి కలుగుచున్నది
14యెహోవా, నీయందునమ్మిక యుంచియున్నాను
నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను
15నా కాలగతులు నీ వశములో నున్నవి
నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము
నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము
16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము
నీ కృపచేత నన్ను రక్షింపుము
17యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గునొందనియ్యకుము
భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక
18అబద్దికుల పెదవులు మూయబడును గాక
వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు
19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది
నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది
20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు
వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
21ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను
ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు
ఆయన స్తుతినొందును గాక
22భీతిచెందినవాడనై-నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని
అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా
నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి
23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి
యెహోవా విశ్వాసులను కాపాడును
గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును
24యెహోవాకొరకు కనిపెట్టువారలారా,
మీరందరు మనస్సున ధైరయము వహించి నిబ్బరముగా నుండుడి
Psalm 31


1In thee, O LORD, do I put my trust; let me never be ashamed: deliver me in thy righteousness.
2Bow down thine ear to me; deliver me speedily: be thou my strong rock, for an house of defence to save me.
3For thou art my rock and my fortress; therefore for thy name's sake lead me, and guide me.
4Pull me out of the net that they have laid privily for me: for thou art my strength.
5Into thine hand I commit my spirit: thou hast redeemed me, O LORD God of truth.
6I have hated them that regard lying vanities: but I trust in the LORD.

7I will be glad and rejoice in thy mercy: for thou hast considered my trouble; thou hast known my soul in adversities;
8And hast not shut me up into the hand of the enemy: thou hast set my feet in a large room.
9Have mercy upon me, O LORD, for I am in trouble: mine eye is consumed with grief, yea, my soul and my belly.
10For my life is spent with grief, and my years with sighing: my strength faileth because of mine iniquity, and my bones are consumed.
11I was a reproach among all mine enemies, but especially among my neighbours, and a fear to mine acquaintance: they that did see me without fled from me.
12I am forgotten as a dead man out of mind: I am like a broken vessel.
13For I have heard the slander of many: fear was on every side: while they took counsel together against me, they devised to take away my life.
14But I trusted in thee, O LORD: I said, Thou art my God.
15My times are in thy hand: deliver me from the hand of mine enemies, and from them that persecute me.
16Make thy face to shine upon thy servant: save me for thy mercies' sake.
17Let me not be ashamed, O LORD; for I have called upon thee: let the wicked be ashamed, and let them be silent in the grave.
18Let the lying lips be put to silence; which speak grievous things proudly and contemptuously against the righteous.
19Oh how great is thy goodness, which thou hast laid up for them that fear thee; which thou hast wrought for them that trust in thee before the sons of men!
20Thou shalt hide them in the secret of thy presence from the pride of man: thou shalt keep them secretly in a pavilion from the strife of tongues.
21Blessed be the LORD: for he hath shewed me his marvellous kindness in a strong city.
22For I said in my haste, I am cut off from before thine eyes: nevertheless thou heardest the voice of my supplications when I cried unto thee.
23O love the LORD, all ye his saints: for the LORD preserveth the faithful, and plentifully rewardeth the proud doer.
24Be of good courage, and he shall strengthen your heart, all ye that hope in the LORD.

Friday, November 20, 2009

కీర్తనలు 30వ అధ్యాయము

యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపక నీవు నన్నుద్ధరించి యున్నావు
అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను
2యెహోవా నా దేవా,
నేను నీకు మొఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి
3యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి
నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రతికించితివి
4యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి
ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి
5ఆయన కోపము నిమిషమాత్రముండును
ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును
సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను
ఉదయమున సంతోషము కలుగును
6నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని
7యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి
నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలతజెందితిని
8యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితివి
నా ప్రభువును బతిమాలుకొంటిని
నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
9నన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
10యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము
యెహోవా, నాకు సహాయుడవై యుండుము
11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు
నా అంగలార్పును నీవు నాత్యముగా మార్చియున్నావు
12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు
యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను
Psalm 30
   1I will extol thee, O LORD; for thou hast lifted me up, and hast not made my foes to rejoice over me.
   2O LORD my God, I cried unto thee, and thou hast healed me.
   3O LORD, thou hast brought up my soul from the grave: thou hast kept me alive, that I should not go down to the pit.
   4Sing unto the LORD, O ye saints of his, and give thanks at the remembrance of his holiness.
   5For his anger endureth but a moment; in his favour is life: weeping may endure for a night, but joy cometh in the morning.
   6And in my prosperity I said, I shall never be moved.
   7LORD, by thy favour thou hast made my mountain to stand strong: thou didst hide thy face, and I was troubled.
   8I cried to thee, O LORD; and unto the LORD I made supplication.
   9What profit is there in my blood, when I go down to the pit? Shall the dust praise thee? shall it declare thy truth?
   10Hear, O LORD, and have mercy upon me: LORD, be thou my helper.
   11Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness;
   12To the end that my glory may sing praise to thee, and not be silent. O LORD my God, I will give thanks unto thee for ever.

Thursday, November 19, 2009

కీర్తనలు 29వ అధ్యాయము

దైవపుత్రులారా, యెహోవాను ఆరోపించుడి
ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి
2యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి
ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి
3యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు
మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు
4యెహోవా స్వరము బలమైనది
యెహోవా స్వరము ప్రభావముగలది
5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును
యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును
6దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును
లెబనోనును షిర్యోనును గురుపోతు పిల్లలవలె గంతులు వేయునట్లు ఆయన చేయును
7 యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది
8యెహోవా స్వరము అరణ్యమును కదలించును
యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
9యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును
అది ఆకులు రాల్చును
ఆయన ఆలయములో ఉన్నవన్నియు ఆయనకే ప్రభావము అనుచున్నవి
10యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను
యెహోవా నిత్యము రాజుగా ఆసినుడైయున్నాడు
11యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును
Psalm 29
1Give unto the LORD, O ye mighty, give unto the LORD glory and strength.
2Give unto the LORD the glory due unto his name; worship the LORD in the beauty of holiness.
3The voice of the LORD is upon the waters: the God of glory thundereth: the LORD is upon many waters.
4The voice of the LORD is powerful; the voice of the LORD is full of majesty.
5The voice of the LORD breaketh the cedars; yea, the LORD breaketh the cedars of Lebanon.
6He maketh them also to skip like a calf; Lebanon and Sirion like a young unicorn.
7The voice of the LORD divideth the flames of fire.
8The voice of the LORD shaketh the wilderness; the LORD shaketh the wilderness of Kadesh.
9The voice of the LORD maketh the hinds to calve, and discovereth the forests: and in his temple doth every one speak of his glory.
10The LORD sitteth upon the flood; yea, the LORD sitteth King for ever.
11The LORD will give strength unto his people; the LORD will bless his people with peace

Saturday, October 31, 2009

కీర్తనలు 28వ అధ్యాయము Psalm 28

యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము
నీవు మౌనముగా నుండినయెడల
నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును
2. నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు
నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు
నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము
3. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము
వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని
తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు
4. వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము
వారుచేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము
వారికి తగిన ప్రతిఫలమిమ్ము
5. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు
ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు
కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును
6. యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు
ఆయనకు స్తోత్రము కలుగునుగాక
7. ఆయన నా ఆశ్రయము, నా కేడెము
నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను
కావున నా హృదయము ప్రహర్షించుచున్నది
కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను
8. యెహోవా తన జనులకు ఆశ్రయము
ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము
9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము
వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము
Psalm 28
1Unto thee will I cry, O LORD my rock; be not silent to me: lest, if thou be silent to me, I become like them that go down into the pit.
2Hear the voice of my supplications, when I cry unto thee, when I lift up my hands toward thy holy oracle.
3Draw me not away with the wicked, and with the workers of iniquity, which speak peace to their neighbours, but mischief is in their hearts.
4Give them according to their deeds, and according to the wickedness of their endeavours: give them after the work of their hands; render to them their desert.
5Because they regard not the works of the LORD, nor the operation of his hands, he shall destroy them, and not build them up.
6Blessed be the LORD, because he hath heard the voice of my supplications.
7The LORD is my strength and my shield; my heart trusted in him, and I am helped: therefore my heart greatly rejoiceth; and with my song will I praise him.
8The LORD is their strength, and he is the saving strength of his anointed.
9Save thy people, and bless thine inheritance: feed them also, and lift them up for ever.

Friday, October 30, 2009

కీర్తనలు 27వ అధ్యయము Psalm 27

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు
నేను ఎవరికి భయపడుదును?
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
2నా శరీరమాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు
నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్ట్రిల్లికూలిరి
3నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
నా మీదికి యుద్ధము రేగినను
దీనిలో నేను ధైర్యము విడవకుందును
4 యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని
దానిని నేను వెదకుచున్నాను
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను
5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును
తన గుడారపు మాటున నన్ను దాచును
ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును
6ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువులకంటె నా తలయెత్తబడును
ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను
నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను
7యెహోవా, నేను కఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము
కరుణతో నా కుత్తరమిమ్ము
8. నా సన్నిధి వెదకుడని నీవుసెలవియ్యగా
-యెహోవా, నీ సన్నిధిని నేను వెదకెదనని
నా హృదయము నీతో అనెను
9. ని ముఖమును నాకు దాచకుము
నా సహాయుడవు నీవే
రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకుము
నన్ను విడువకుము
10. నా తలిదండ్రులు నన్ను విడిచినను
యెహోవా నన్ను చేరదీయును
11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము
నాకొరకు పొంచియున్నవారిని చూచి
సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము
12. అబద్దసాక్షులును క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును
నా మీదికి లేచియున్నారు
నా విరోధుల యిచ్చకు నన్ను అప్పగింపకుము
13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుచునన్న
నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?
14. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము
యెహోవాకొరకు కనిపెట్టికొని యుండుము

1The LORD is my light and my salvation; whom shall I fear? the LORD is the strength of my life; of whom shall I be afraid?
2When the wicked, even mine enemies and my foes, came upon me to eat up my flesh, they stumbled and fell.
3Though an host should encamp against me, my heart shall not fear: though war should rise against me, in this will I be confident.
4One thing have I desired of the LORD, that will I seek after; that I may dwell in the house of the LORD all the days of my life, to behold the beauty of the LORD, and to enquire in his temple.
5For in the time of trouble he shall hide me in his pavilion: in the secret of his tabernacle shall he hide me; he shall set me up upon a rock.
6And now shall mine head be lifted up above mine enemies round about me: therefore will I offer in his tabernacle sacrifices of joy; I will sing, yea, I will sing praises unto the LORD.
7Hear, O LORD, when I cry with my voice: have mercy also upon me, and answer me.
8When thou saidst, Seek ye my face; my heart said unto thee, Thy face, LORD, will I seek.
9Hide not thy face far from me; put not thy servant away in anger: thou hast been my help; leave me not, neither forsake me, O God of my salvation.
10When my father and my mother forsake me, then the LORD will take me up.
11Teach me thy way, O LORD, and lead me in a plain path, because of mine enemies.
12Deliver me not over unto the will of mine enemies: for false witnesses are risen up against me, and such as breathe out cruelty.
13I had fainted, unless I had believed to see the goodness of the LORD in the land of the living.
14Wait on the LORD: be of good courage, and he shall strengthen thine heart: wait, I say, on the LORD.

Wednesday, October 21, 2009

కీర్తనలు 26 వ అధ్యాయము


యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను
నాకు తీర్పు తీర్చును
ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను
2. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము
నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము
3.నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను
నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
4 పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను
వేషదారులతో పొందుచేయను
5 దుష్టుల సంఘము నాకు అసహ్యము
భక్తిహీనులతో సాంగత్యముచేయను
6 నిర్దోషినని నా చేతులు కడుగుకొందును
యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును
7. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును
నీ ఆశ్చర్యకార్యములను వివరింతును
8. యెహోవా, నీ నివాసమందిరమును
నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను
9. పాపులతో నా ప్రాణమును చేర్చకుము
నరహతకులతో నా జీవమును చేర్చకుము.
10వారి చేతిలో దుష్కార్యములు కలవు
వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది
11. నేను యథార్థవంతుడనై నడచుకొనుచున్నాను
నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము
12.సమభూమిలో నా పాదము నిలిపియున్నాను
సమాజములో యెహోవాను స్తుతించెదను
Psalm 26
1Judge me, O LORD; for I have walked in mine integrity: I have trusted also in the LORD; therefore I shall not slide.
2Examine me, O LORD, and prove me; try my reins and my heart.
3For thy lovingkindness is before mine eyes: and I have walked in thy truth.
4I have not sat with vain persons, neither will I go in with dissemblers.
5I have hated the congregation of evil doers; and will not sit with the wicked.
6I will wash mine hands in innocency: so will I compass thine altar, O LORD:
7That I may publish with the voice of thanksgiving, and tell of all thy wondrous works.
8LORD, I have loved the habitation of thy house, and the place where thine honour dwelleth.
9Gather not my soul with sinners, nor my life with bloody men:
10In whose hands is mischief, and their right hand is full of bribes.
11But as for me, I will walk in mine integrity: redeem me, and be merciful unto me.
12My foot standeth in an even place: in the congregations will I bless the LORD.

Tuesday, October 20, 2009

కీర్తనలు 25వ అధ్యాయము

యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను
2. నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నను
నన్ను సిగ్గుపడనియ్యకుము
నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుము
3. నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొదడు
హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు.
4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము
నీత్రోవలను నాకు తేటపరచుము
5. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము
నీవే నా రక్షణకర్తవైన దేవుడవు
దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను
6. యెహోవా, నీ కరుణాతిశములను జ్ఞాపకముచేసికొనుము
నీ కృపాతిశయములను జ్ఞాపకముచేసికొనుము
అవి పూర్వమునుండి యున్నవే గదా.
7. నా బాల్యపాపములను నా అతిక్రమములను
జ్ఞాపకముచేసికొనుము
యెహోవా నీ కృపనుబట్టి
నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము
8. యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు
కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును
9. న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును
తన మార్గమును దీనులకు నేర్పును
10. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో
యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
11. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది
నీ నామమునుబట్టి దానిని క్షమింపుము
12. యెహోవాయందు భయభక్తులుగల వాడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును
13. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును
అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును
14. యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది
ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును
15.నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది
ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును
16. నేను ఏకాకిని, బాధపడువాడను
నా వైపుతిరిగి నన్ను కరుణింపుము
17. నా హృదయవేదనలు అతివిస్తారములు
ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము
18. నా బాధను నా వేదనను కనుగొనుము
నా పాపములన్నిటిని క్షమింపుము
19. నా శత్రువులను చూడుము, వారు అనేకులు
క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు
20. నేను శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము
నా ప్రాణము కాపాడుము, నన్ను రక్షింపుము
21. నీ కొరకు నేను కనిపెట్తుచున్నాను
యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక
22. దేవా, వారి బాధలన్నిటిలోనుండి
ఇశ్రాయేలీయులను విమోచింపుము
Psalm 25
1Unto thee, O LORD, do I lift up my soul.
2O my God, I trust in thee: let me not be ashamed, let not mine enemies triumph over me.
3Yea, let none that wait on thee be ashamed: let them be ashamed which transgress without cause.
4Shew me thy ways, O LORD; teach me thy paths.
5Lead me in thy truth, and teach me: for thou art the God of my salvation; on thee do I wait all the day.
6Remember, O LORD, thy tender mercies and thy lovingkindnesses; for they have been ever of old.
7Remember not the sins of my youth, nor my transgressions: according to thy mercy remember thou me for thy goodness' sake, O LORD.
8Good and upright is the LORD: therefore will he teach sinners in the way.
9The meek will he guide in judgment: and the meek will he teach his way.
10All the paths of the LORD are mercy and truth unto such as keep his covenant and his testimonies.
11For thy name's sake, O LORD, pardon mine iniquity; for it is great.
12What man is he that feareth the LORD? him shall he teach in the way that he shall choose.
13His soul shall dwell at ease; and his seed shall inherit the earth.
14The secret of the LORD is with them that fear him; and he will shew them his covenant.
15Mine eyes are ever toward the LORD; for he shall pluck my feet out of the net.
16Turn thee unto me, and have mercy upon me; for I am desolate and afflicted.
17The troubles of my heart are enlarged: O bring thou me out of my distresses.
18Look upon mine affliction and my pain; and forgive all my sins.
19Consider mine enemies; for they are many; and they hate me with cruel hatred.
20O keep my soul, and deliver me: let me not be ashamed; for I put my trust in thee.
21Let integrity and uprightness preserve me; for I wait on thee.
22Redeem Israel, O God, out of all his troubles.

Thursday, October 15, 2009

కీర్తనలు 24వ అధ్యాయము


భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులును యెహోవావే
2. ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను
ప్రవాహములమీద దాని స్థిరపరచెను
3. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు?
ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
4. వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు
కపటముగ ప్రమాణము చేయకయు
నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే
5. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును
తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును
6. ఆయన నాశ్రయించువారు
యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే(సెలా)
7. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి
మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా,మిమ్మును లేవనెత్తికొనుడి
8. మహిమగల యీ రాజు ఎవడు?
బలశౌర్యములుగల యెహోవా
యుద్ధశూరుడైన యెహోవా
9. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి
పురాతనమైన తలుపులారా,
మహిమగల రాజు ప్రవేశించునట్లు
మిమ్మును లేవనెత్తికొనుడి
10. మహిమగల యీ రాజు ఎవడు?
సైన్యములకధిపతియగు యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు

1 The earth is the LORD's, and the fulness thereof; the world, and they that dwell therein.
2 For he hath founded it upon the seas, and established it upon the floods.
3 Who shall ascend into the hill of the LORD? or who shall stand in his holy place?
4 He that hath clean hands, and a pure heart; who hath not lifted up his soul unto vanity, nor sworn deceitfully.
5 He shall receive the blessing from the LORD, and righteousness from the God of his salvation.
6 This is the generation of them that seek him, that seek thy face, O Jacob. Selah.
7 Lift up your heads, O ye gates; and be ye lift up, ye everlasting doors; and the King of glory shall come in.
8 Who is this King of glory? The LORD strong and mighty, the LORD mighty in battle.
9 Lift up your heads, O ye gates; even lift them up, ye everlasting doors; and the King of glory shall come in.
10 Who is this King of glory? The LORD of hosts, he is the King of glory. Selah.

Wednesday, October 14, 2009

కీర్తనలు 23వ అధ్యాయము

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు
శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించు చున్నాడు
3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు
తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు
4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను
నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును
5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు
నూనెతో నా తల అంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నది
6. నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును
చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను

1The LORD is my shepherd; I shall not want.
2He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.
3He restoreth my soul: he leadeth me in the paths of righteousness for his name's sake.
4Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil: for thou art with me; thy rod and thy staff they comfort me.
5Thou preparest a table before me in the presence of mine enemies: thou anointest my head with oil; my cup runneth over.
6Surely goodness and mercy shall follow me all the days of my life: and I will dwell in the house of the LORD for ever.1The LORD is my shepherd; I shall not want.
2He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.
3He restoreth my soul: he leadeth me in the paths of righteousness for his name's sake.
4Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil: for thou art with me; thy rod and thy staff they comfort me.
5Thou preparest a table before me in the presence of mine enemies: thou anointest my head with oil; my cup runneth over.
6Surely goodness and mercy shall follow me all the days of my life: and I will dwell in the house of the LORD for ever.

Tuesday, October 13, 2009

కీర్తనలు 22వ అధ్యాయము

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?
నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?
2. నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను
రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు
అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు
3. నీవు ఇశ్రాయేలు చేయు స్త్రోత్రములమీద ఆసీనుడవై యున్నావు
4 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి
వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి
5. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి
నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి
6. నేను నరుడను కాను నేను పురుగును
నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను
7. నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు
8. యెహోవామీద నీ భారము మోపుము
ఆయన వానిని విడిపించునేమో
వాడు ఆయనకు ఇష్టుడు కదా ఆయన వానిని తప్పించునేమో అందురు
9 గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా
నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా
నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి
10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే
నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే
11. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు
నాకు దూరముగా నుండకుము
12. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి
బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి
13. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్ళు తెరచుచున్నారు
14 నేను నీళ్ళవలె పారబోయబడి యున్నాను
నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి
నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది
15. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను
నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది
నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు
16. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి
దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి యున్నారు
వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు
17. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను
వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు
నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు
19. యెహోవా, దూరముగా నుండకుము
నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము
20 ఖడ్గమునుండి నా ప్రాణమును
కుక్కల బలమునుండి నా ప్రాణమును రక్షింపుము
21. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము
గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నా కుత్తరమిచ్చి యున్నావు
22 నీ నామము నా సహోదరులకు ప్రచురపరచెదను
సమాజమధ్యమున నన్ను స్తుతించెదను
23 యెహోవాయందు భయభక్త్లులు గలవారలారా, ఆయనను స్తుతించుడి
యాకోబు వంశథులారా, మీరందరు ఆయనను ఘనపరచుడి
ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి
24 ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు
వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను
25 మహా సమాజములో నన్ను గూర్చి నేను కీర్తనపాడెదను
ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను
26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు
యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు
మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును
27 భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని
యెహోవాతట్టు తిరిగెదరు
అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారముచేసెదరు
28 రాజ్యము యెహోవాదే
అన్యజనులలో ఏలువాడు ఆయనే
29 భూమిమీద వర్థిల్లుచున్న వారందరు అన్న పానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు
తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు
30 ఒక సంతతివారు ఆయనను సేవింతురు
రాబోవు తరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు
31 వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు
ఆయన నీతిని వారికి ప్రచురపరతురు

Saturday, October 10, 2009

కీర్తనలు 21వ అధ్యాయము

యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించుచున్నాడు
నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు
2. అతని అభీష్టము నీవు సఫలము చేయుచున్నావు
అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు.
3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు
అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు
4. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావు
సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి యున్నావు
నీ రక్షణవలన అతనికి గొప్పమహిమ కలిగెను
గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు
6. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి యున్నావు
నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు
7 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మికయుంచుచున్నాడు
సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండనిలుచును
8. నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును
నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును
9. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు
తన కోపమువలన యెహోవా వారిని నిర్మూలము చేయును
అగ్ని వారిని దహించును
10 భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు
నరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు
11 వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి
కాని దానిని కొనసాగింపలేకపోయిరి
12 నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు
నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు
13 యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనును
మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము
kIrtanalu

Friday, October 9, 2009

కీర్తనలు ౨౦వ అధ్యాయము

ఇరవైవ అధ్యాయము
ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక
యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక
2 పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక
సియోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక
3 ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక
నీ దహన బలులను అంగీకరించును గాక
4 నీ కోరికను సిద్ధింపజేసి
నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక
5 యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము
మా దేవుని నా మమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము
నీ ప్రార్థలన్నియు యెహోవా సఫలపరచును గాక
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును
రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును
తన పరిశుద్ధాకాశములోనుండి అతనికుత్తరమిచ్చును
7 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదుము
8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము చేచి చక్కగా నిలుచున్నాము
9 యెహోవా, రక్షింపుము
మేము మొఱ్ఱపెట్టునప్పుడు రాజు ఉత్తరమిచ్చును గాక

Thursday, October 8, 2009

కీర్తనలు 19వ అధ్యాయము

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి
అంతరక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నవి
2 పగటికి పటిగలు బోధచేయుచున్నది
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది
3 వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది
లోక దిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి
వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను
5 అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లికుమారుని వలె ఉన్నాడు
కుమారుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు
6 అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు
అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు
7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది
అది ప్రాణమును తెప్పరిల్లజేయును
యెహోవా శాసనము నమ్మదగినది
అది బుద్దిహీనులకు జ్ఞానము పుట్టించును
8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును
యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును
9 యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును
యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి
10 అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి
తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి
11 వాటివలన నీ సేవకుడు హెచ్చరికనొందును
వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును
12 తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము
13 దురాభిమాన పాపములో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము
అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నొందా రహితుడనగుదును
14 యెహోవా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా,
నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును
నీ దృష్టికి అంగీకారములగును గాక!

Wednesday, October 7, 2009

కీర్తనలు 18 అధ్యాయము

యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను
2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు
నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు
నేను ఆశ్రయించియున్న నా దుర్గము
3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా
ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును
4 మరణ పాశములు చుట్టుకొనగను
భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదిరింపగను
5. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను
మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
6. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
నా దేవునికి ప్రార్థన చేసితిని
ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థననంగీకరించెను
నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను
7. అప్పుడు భూమి కంపించి అదిరెను
పర్వతముల పునాదులు వణకెను
ఆయన కోపింపగా అవి కంపించెను
8 ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను
ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను
9 నిప్పుకణములు రాజబెట్టెను
మేఘములను వంచి ఆయన వచ్చెను
ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను
గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను
11 గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింపజేసెను
జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను
12 ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడగండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.
13 యెహోవా ఆకాశమందు గర్జన చేసెను
సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను
వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను
14 ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను
మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను
15 యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా
నీ గర్జింపునకు ప్రవాహముల అడుగుభగాములు కనబడెను
భూమి పునాదులు కనబడెను
ఉన్నతస్థలమునుండి చెయ్యిచాపి ఆయన నన్ను పట్టుకొనెను
నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను
17 బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు
నాకంటె బలిష్టులైయుండగా
వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను
18 ఆపత్కాలమందు వారు నామీదికి రాగా
యెహోవా నన్ను ఆదుకొనెను
19 విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొనివచ్చెను
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను
20 నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను
నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను
21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను
భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను
22 ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను
ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను
23 దొషక్రియలు నేను చేయనొల్లకుంటిని
ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని
24 కావున యెహోవా నేను నిర్దషిగానుండుటచూచి
తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి
నాకు ప్రతిఫలమిచ్చెను
25 దయగలవారియెడల నీవు దయచూపించుదువు
యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
26 సద్భావముగలవారి యెడల నీవు సద్భావము చూపుదువు
మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
27 శ్రమపడువారిని నీవు రక్షించెదవు
గర్విష్టులకు విరోధివై వారిని అణచివేసెదవు
28 నా దీపమును వెలిగించువాడవు నీవే
నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగాచేయును
29 నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును
నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును
30 దేవుదు యథార్థవంతుడు
యెహోవా వాక్కు నిర్మలము
తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము
31 యెహోవా తప్ప దేవుడేడి?
మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
32 నాకు బలము ధరింపజేయువాడు ఆయనే
నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే
33 నా కాళ్ళు జింక కాళ్ళవలె చేయుచున్నాడు
ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు
34 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే
నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును
35 నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు
నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను
నీ సాత్వికము నన్ను గొప్పచేసెను
36 నా పాదములకు చోటు విశాలపరచితివి
నా చీలమండలు బెణకలేదు
37 నాశత్రువులను తరిమి పట్టుకొందును
వారిని నశింపజేయువరకు నేను తిరుగను
38 వారు నా పాదముల క్రింద పడుదురు
వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును
39 యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి
నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి
40 నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి
నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని
41 వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను
యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన వారి కుత్తరమియ్యకుండును
42 అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని
వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని
ప్రజలుచేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి
నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి
నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించుదురు
అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు
45 అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు
తమ దుర్గములను విడవి వచ్చెదరు
46 యెహోవా జీవముగలవాడు
నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు
నా రక్షకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందును గాక
47 ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు
జనములను నాకు లోపరచువాడు ఆయనే
48 ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును
నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు
బలత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి
నీవు నన్ను విడిపించుదువు
49 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను
నీ నామ కీర్తన గానము చేసెదను
50 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు
అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును
నిత్యము కనికరము చూపువాడవు

Sunday, October 4, 2009

కీర్తనలు 17వ అద్యాయము

యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱనంగీకరించుము
నా ప్రార్థనకి చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు
2. నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక
నీ కనుదృష్టి న్యాయముగా చూచును
రాత్రివేళనీవు నన్ను దర్శించి నాహృదయమును పరిశీలించితివి
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు
నోటి మాటచేత నేను అతిక్రమింపను
4. మనుష్యుల కార్యముల విషయమైతే
బలత్కారుల తప్పించుకొనుటకై
నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను
5. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను
నాకు కాలు జారలేదు
6. నేను నీకు మొఱ్ఱపెట్టుకొన్యున్నాను
దేవ, నీవు నాకుత్తరమిచ్చెదవు
నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము
7 నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారిచేతిలోనుండి నీ కుడిచేత రక్షించువాడా,
8 నీ కృపాతిశయములను చూపుము
9 ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము
నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపడుము
నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండను
నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము
10 వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నరు
వారినోరు గర్వముగా మాటలాడును
11 మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నరు
మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.
12 వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను
చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నరు
13. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వానిని పడగొట్టుము
దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము
14 లోకులచేతిలోనుండి
ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లొకుల చేతిలోనుండి
నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము
నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నవు
వారు కుమారులు కలిగి తృప్తినొదుదురు
తమ ఆస్తిని తమ పిల్లలల్కు విడిచిపెట్టుదురు
15. నేనైతే నీతిగలవడనై నీ ముఖదర్శనము చేసెదను
నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో
నా ఆశను తీర్చుకొందును

Thursday, October 1, 2009

కీర్తనలు 16వ అద్యాయము



1. దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
 Preserve me, O God, for in Thee do I put my trust.

2. నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును
 O my soul, thou hast said unto the LORD, "Thou art my Lord; my goodness extendeth not to Thee,

3. నేనీలాగందును - భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు;
వారు నాకు కేవలము ఇష్టులు.
 but to the saints that are on the earth, and to the excellent, in whom is all my delight."

4. యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును.
వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను
వారి పేళ్లు నా పెదవులనెత్తను.
 Their sorrows shall be multiplied, that hasten after another god; their drink offerings of blood will I not offer, nor take up their names upon my lips.

5. యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము
నీవే నా భాగమును కాపాడుచున్నావు.
 The LORD is the portion of mine inheritance and of my cup; Thou maintainest my lot.

6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
 The lines have fallen for me in pleasant places; yea, I have a goodly heritage.

7. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను
రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.
 I will bless the LORD who hath given me counsel; my reins also instruct me in the night seasons.

8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.
ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
 I have set the LORD always before me; because He is at my right hand, I shall not be moved.

9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది
నా ఆత్మ హర్షించుచున్నది
నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
 Therefore my heart is glad and my spirit rejoiceth; my flesh also shall rest in hope.

10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు
నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
 For Thou wilt not leave my soul in hell; neither wilt Thou suffer Thine Holy One to see corruption.

11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు
నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు
నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
 Thou wilt show me the path of life; in Thy presence is fullness of joy; at Thy right hand there are pleasures for evermore.

Thursday, September 24, 2009

కీర్తనలు 14వ అద్యాయము

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదములో అనుకొందురు
వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు
మేలుచేయు వాడొకడునులేడు
2 వివేకముకలిగి దేవుని వెదకువారు కలరేమో అని
యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను
3. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు
మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచు
పాపము చేయువారికందరికిని తెలివి లేదా!
పాపము చేయువారు బహుగా భయపడుదురు
5. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు
6. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు
అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు
7. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక.
యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.

Saturday, September 19, 2009

13వ అద్యాయము

1. .యెహోవా, ఎన్నాళ్ళవరకు నన్ను మరిచిపోవుదువు?
నిత్యము మరచెదవా?
నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?
ఎంతవరకు నా శత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
3. .యెహోవా, నా దేవా నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
4. నేను మరణనిద్ర నొందకుండను - వాని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండను
నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను
నా కన్నులకు వెలుగిమ్ము
5 నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను
నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు.