Showing posts with label తెలుగు బైబిలు. Show all posts
Showing posts with label తెలుగు బైబిలు. Show all posts

Sunday, February 5, 2012

కీర్తనలు 137వ అధ్యాయము

బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు
మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చుచుంటిమి
By the rivers of Babylon, there we sat down, yea, we wept, when we remembered Zion.
2 వాటిమధ్యనున్న నిరవంజిచెట్టుకు మన సితారాలు తగిలించితిమి
We hanged our harps upon the willows in the midst thereof.

3 అచ్చటమనలను చెరగొన్నవారు - ఒక పాట పాడుడి అనిరి
మనలను బాధించినవారు
- సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి
అని మనవలన ఉల్లాసము గోరిరి
For there they that carried us away captive required of us a song; and they that wasted us required of us mirth, saying, Sing us one of the songs of Zion.

4 అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
How shall we sing the LORD's song in a strange land?

5 యెరుషలేమా, నేను నిన్ను మరచిన యెడల
నా కుడిచేయి తన నేర్పును మరచును గాక
If I forget thee, O Jerusalem, let my right hand forget her cunning.

6 నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల,
నా ముఖ్య సంతోషముకంటె
నేను యెరుషలేమును హెచ్చుగా ఎంచినయెడల
నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక.
If I do not remember thee, let my tongue cleave to the roof of my mouth; if I prefer not Jerusalem above my chief joy.

7 యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుము
యెరుషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము
దానిని నాశనముచేయుడి
సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా
Remember, O LORD, the children of Edom in the day of Jerusalem; who said, Rase it, rase it, even to the foundation thereof.

8 పాడు చేయబడబోవు బబులోను కుమారీ,

నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు
O daughter of Babylon, who art to be destroyed; happy shall he be, that rewardeth thee as thou hast served us.

9 నీ పనిపిల్లలను పట్తుకొని వారిని బందకువేసి కొట్టువాడు ధన్యుడు.
Happy shall he be, that taketh and dasheth thy little ones against the stones.



Tuesday, January 10, 2012

కీర్తనలు 135వ అధ్యాయము - Psalms 135


1 యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
Praise ye the LORD. Praise ye the name of the LORD; praise him, O ye servants of the LORD.

2 యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.
Ye that stand in the house of the LORD, in the courts of the house of our God.

3 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
Praise the LORD; for the LORD is good: sing praises unto his name; for it is pleasant.

4 యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను.
For the LORD hath chosen Jacob unto himself, and Israel for his peculiar treasure.

5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.
For I know that the LORD is great, and that our Lord is above all gods.

6 ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
Whatsoever the LORD pleased, that did he in heaven, and in earth, in the seas, and all deep places.

7 భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
He causeth the vapours to ascend from the ends of the earth; he maketh lightnings for the rain; he bringeth the wind out of his treasuries.

8 ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.
Who smote the firstborn of Egypt, both of man and beast.

9 ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యో గస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరి గించెను.
Who sent tokens and wonders into the midst of thee, O Egypt, upon Pharaoh, and upon all his servants.

10 అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు.
Who smote great nations, and slew mighty kings;


11 అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.
Sihon king of the Amorites, and Og king of Bashan, and all the kingdoms of Canaan:

12 ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
And gave their land for an heritage, an heritage unto Israel his people.

13 యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును.
Thy name, O LORD, endureth for ever; and thy memorial, O LORD, throughout all generations.

14 యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
For the LORD will judge his people, and he will repent himself concerning his servants.

15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
The idols of the heathen are silver and gold, the work of men's hands.

16 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
They have mouths, but they speak not; eyes have they, but they see not;

17 చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.
They have ears, but they hear not; neither is there any breath in their mouths.

18 వాటినిచేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
They that make them are like unto them: so is every one that trusteth in them.

19 ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి
Bless the LORD, O house of Israel: bless the LORD, O house of Aaron:

20 లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహో వాను సన్నుతించుడి.
Bless the LORD, O house of Levi: ye that fear the LORD, bless the LORD.

21 యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.
Blessed be the LORD out of Zion, which dwelleth at Jerusalem. Praise ye the LORD.

Monday, December 26, 2011

కీర్తనలు 134వ అధ్యాయము

1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
Behold, bless ye the LORD, all ye servants of the LORD, which by night stand in the house of the LORD.

2 పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
Lift up your hands in the sanctuary, and bless the LORD.

3 భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
The LORD that made heaven and earth bless thee out of Zion.

Friday, December 23, 2011

కీర్తనలు 133వ అధ్యాయము

1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు! ఎంత మనోహరము!
Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!

2 అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
It is like the precious ointment upon the head, that ran down upon the beard, even Aaron's beard: that went down to the skirts of his garments;

3 సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును
అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.
As the dew of Hermon, and as the dew that descended upon the mountains of Zion: for there the LORD commanded the blessing, even life for evermore.

కీర్తనలు 132వ అధ్యాయము

1 యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
Lord, remember David, and all his afflictions:

2 అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
How he sware unto the LORD, and vowed unto the mighty God of Jacob;

3 యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
Surely I will not come into the tabernacle of my house, nor go up into my bed;

4 ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు
యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు

I will not give sleep to mine eyes, or slumber to mine eyelids,

5 నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను
నేను పరుండు మంచముమీది కెక్కను
నా కన్నులకు నిద్ర రానియ్యను
నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.

Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.

6 అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి
యాయరు పొలములలో అది దొరికెను.

Lo, we heard of it at Ephratah: we found it in the fields of the wood.

7 ఆయన నివాసస్థలములకు పోదము రండి
ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.

We will go into his tabernacles: we will worship at his footstool.

8 యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము
నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

Arise, O LORD, into thy rest; thou, and the ark of thy strength.

9 నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక
నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.

Let thy priests be clothed with righteousness; and let thy saints shout for joy.

10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము
నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

For thy servant David's sake turn not away the face of thine anointed.

11 నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును.
నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల
నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల
వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని

The LORD hath sworn in truth unto David; he will not turn from it; Of the fruit of thy body will I set upon thy throne.

12 యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను
ఆయన మాట తప్పనివాడు.

If thy children will keep my covenant and my testimony that I shall teach them, their children shall also sit upon thy throne for evermore.

13 యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు.
తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

For the LORD hath chosen Zion; he hath desired it for his habitation.

14 ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును
ఇక్కడనే నేను నివసించెదను

This is my rest for ever: here will I dwell; for I have desired it.

15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను
దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను

I will abundantly bless her provision: I will satisfy her poor with bread.

16 దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను
.దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.

I will also clothe her priests with salvation: and her saints shall shout aloud for joy.

17 అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను
నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.

There will I make the horn of David to bud: I have ordained a lamp for mine anointed.

18 అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను
అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

His enemies will I clothe with shame: but upon himself shall his crown flourish.

Thursday, December 22, 2011

కీర్తనలు 131వ అధ్యాయము

1 యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు
నా కన్నులు మీదు చూచునవి కావు
నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను
నేను అభ్యాసము చేసికొనుట లేదు.

Lord, my heart is not haughty, nor mine eyes lofty: neither do I exercise myself in great matters, or in things too high for me.

2 నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను
సముదాయించుకొని యున్నాను
చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు
నా ప్రాణము నాయొద్ద నున్నది
.
Surely I have behaved and quieted myself, as a child that is weaned of his mother: my soul is even as a weaned child.

3 ఇశ్రాయేలూ, ఇదిమొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.
Let Israel hope in the LORD from henceforth and for ever.

కీర్తనలు 130వ అధ్యాయము

1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
Out of the depths have I cried unto thee, O LORD.

2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము.
నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

Lord, hear my voice: let thine ears be attentive to the voice of my supplications.

3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
If thou, LORD, shouldest mark iniquities, O Lord, who shall stand?

4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు
నీయొద్ద క్షమాపణ దొరుకును.

But there is forgiveness with thee, that thou mayest be feared.

5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను
నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

I wait for the LORD, my soul doth wait, and in his word do I hope.

6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా
నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా
నా ప్రాణము కనిపెట్టుచున్నది.

My soul waiteth for the Lord more than they that watch for the morning: I say, more than they that watch for the morning.

7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము
యెహోవాయొద్ద కృప దొరుకును.
ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

Let Israel hope in the LORD: for with the LORD there is mercy, and with him is plenteous redemption.

8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
And he shall redeem Israel from all his iniquities.

కీర్తనలు 129వ అధ్యాయము

1 ఇశ్రాయేలు ఇట్లనును
నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు
అధిక
బాధలు కలుగజేయుచు వచ్చిరి
Many a time have they afflicted me from my youth, may Israel now say:

2 నా యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి.
అయినను
వారు నన్ను జయింపలేకపోయిరి.
Many a time have they afflicted me from my youth: yet they have not prevailed against me.

3 దున్నువారు నా వీపుమీద దున్నిరి
వారు చాళ్లను పొడుగుగా చేసిరి.
The plowers plowed upon my back: they made long their furrows.

4 యెహోవా న్యాయవంతుడు
భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.
The LORD is righteous: he hath cut asunder the cords of the wicked.

5 సీయోను పగవారందరు
సిగ్గుపడి
వెనుకకు త్రిప్పబడుదురు గాక.
Let them all be confounded and turned back that hate Zion.

6 వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక
ఎదుగక
మునుపే అది వాడిపోవును
Let them be as the grass upon the housetops, which withereth afore it groweth up:

7 కోయువాడు తన గుప్పిలినైనను
పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
Wherewith the mower filleth not his hand; nor he that bindeth sheaves his bosom.

8 దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక
యెహోవా
నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.
Neither do they which go by say, The blessing of the LORD be upon you: we bless you in the name of the LORD.

Thursday, December 15, 2011

కీర్తనలు 128వ అధ్యాయము, Psalms128

1 యెహోవాయందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

Blessed is every one that feareth the LORD; that walketh in his ways.

2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు
నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

For thou shalt eat the labour of thine hands: happy shalt thou be, and it shall be well with thee.

3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును
నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

Thy wife shall be as a fruitful vine by the sides of thine house: thy children like olive plants round about thy table.

4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
Behold, that thus shall the man be blessed that feareth the LORD.

5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును
నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

The LORD shall bless thee out of Zion: and thou shalt see the good of Jerusalem all the days of thy life.

6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు.
ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

Yea, thou shalt see thy children's children, and peace upon Israel.

కీర్తనలు 127వ అధ్యాయము, Psalms127

1 యెహోవా ఇల్లు కట్టించనియెడల
దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
యెహోవా పట్టణమును కాపాడనియెడల
దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.

Except the LORD build the house, they labour in vain that build it: except the LORD keep the city, the watchman waketh but in vain.

2 మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే.
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.

It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrows: for so he giveth his beloved sleep.

3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము
గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

Lo, children are an heritage of the LORD: and the fruit of the womb is his reward.

4 యౌవనకాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణములవంటివారు.

As arrows are in the hand of a mighty man; so are children of the youth.

5 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు
అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.

Happy is the man that hath his quiver full of them: they shall not be ashamed, but they shall speak with the enemies in the gate.

Sunday, December 11, 2011

కీర్తనలు 126వ అధ్యాయము Psalms 126

1 సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
When the LORD turned again the captivity of Zion, we were like them that dream.

2 మనము కలకనినవారివలె నుంటిమి
మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను.
అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.

Then was our mouth filled with laughter, and our tongue with singing: then said they among the heathen, The LORD hath done great things for them.

3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు
మనము సంతూశాభారితులమైతిమి.

The LORD hath done great things for us; whereof we are glad.

4 దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా
యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.

Turn again our captivity, O LORD, as the streams in the south.

5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు
సంతోషగానముతో పంట కోసెదరు.

They that sow in tears shall reap in joy.

6 పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు
సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him.

కీర్తనలు 125వ అధ్యాయము Psalms 125

1 యెహోవాయందు నమ్మిక యుంచువారు
కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

They that trust in the LORD shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.

2 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు
యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలచుట్టు ఉండును.

As the mountains are round about Jerusalem, so the LORD is round about his people from henceforth even for ever.

3 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు
భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.

For the rod of the wicked shall not rest upon the lot of the righteous; lest the righteous put forth their hands unto iniquity.

4 యెహోవా, మంచివారికి మేలు చేయుము
యథార్థహృదయులకు మేలు చేయుము.

Do good, O LORD, unto those that be good, and to them that are upright in their hearts.

5 తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని
పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును
ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

As for such as turn aside unto their crooked ways, the LORD shall lead them forth with the workers of iniquity: but peace shall be upon Israel.

Tuesday, November 29, 2011

కీర్తనలు 124వ అధ్యాయము Psalms 124

1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు
యెహోవా మనకు తోడైయుండనియెడల

If it had not been the LORD who was on our side, now may Israel say;

2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
If it had not been the LORD who was on our side, when men rose up against us:

3 యెహోవా మనకు తోడైయుండనియెడల
వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

Then they had swallowed us up quick, when their wrath was kindled against us:

4 జలములు మనలను ముంచివేసి యుండును
ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును

Then the waters had overwhelmed us, the stream had gone over our soul:

5 ప్రవాహములై ఘోషించు జలములు
మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

Then the proud waters had gone over our soul.

6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
Blessed be the LORD, who hath not given us as a prey to their teeth.

7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది
ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.

8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది.

Our help is in the name of the LORD, who made heaven and earth.

కీర్తనలు 123వ అధ్యాయము Psalms 123

1 ఆకాశమందు ఆసీనుడవైనవాడా,
నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.

Unto thee lift I up mine eyes, O thou that dwellest in the heavens.

2 దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును
దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు
మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు
మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

Behold, as the eyes of servants look unto the hand of their masters, and as the eyes of a maiden unto the hand of her mistress; so our eyes wait upon the LORD our God, until that he have mercy upon us.

3 యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి
అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును
మామీదికి అధికముగా వచ్చియున్నవి.

Have mercy upon us, O LORD, have mercy upon us: for we are exceedingly filled with contempt.

4 మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.
Our soul is exceedingly filled with the scorning of those that are at ease, and with the contempt of the proud.

కీర్తనలు 122వ అధ్యాయము Psalms 122

1 యెహోవా మందిరమునకు వెళ్లుదమని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
I was glad when they said unto me, Let us go into the house of the LORD.

2 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
Our feet shall stand within thy gates, O Jerusalem.

3 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
Jerusalem is builded as a city that is compact together:

4 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి
యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
Whither the tribes go up, the tribes of the LORD, unto the testimony of Israel, to give thanks unto the name of the LORD.

5 అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు
దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
For there are set thrones of judgment, the thrones of the house of David.

6 యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
Pray for the peace of Jerusalem: they shall prosper that love thee.

7 నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక.
నీ నగరులలో క్షేమముండును గాక.
Peace be within thy walls, and prosperity within thy palaces.

8 నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును
నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
For my brethren and companions' sakes, I will now say, Peace be within thee.

9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము
నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
Because of the house of the LORD our God I will seek thy good.

Saturday, November 26, 2011

కీర్తనలు 121వ అధ్యాయము Psalms 121


1 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను

నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?

I will lift up mine eyes unto the hills, from whence cometh my help.

2 యెహోవావలననే నాకు సహాయము కలుగును

ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

My help cometh from the LORD, which made heaven and earth.

3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు

నిన్ను కాపాడువాడు కునుకడు.

He will not suffer thy foot to be moved: he that keepeth thee will not slumber.

4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు

Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.

5 యెహోవాయే నిన్ను కాపాడువాడు

నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

The LORD is thy keeper: the LORD is thy shade upon thy right hand.

6 పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.

రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.

The sun shall not smite thee by day, nor the moon by night.

7 ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును

ఆయన నీ ప్రాణమును కాపాడును

The LORD shall preserve thee from all evil: he shall preserve thy soul.

8 ఇది మొదలుకొని నిరంతరము

నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

The LORD shall preserve thy going out and thy coming in from this time forth, and even for evermore.

Friday, November 25, 2011

కీర్తనలు 120వ అధ్యాయము Psalms 120


1 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని

ఆయన నాకు ఉత్తరమిచ్చెను.

In my distress I cried unto the LORD, and he heard me.


2 యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు

మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

Deliver my soul, O LORD, from lying lips, and from a deceitful tongue.


3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును?

ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

What shall be given unto thee? or what shall be done unto thee, thou false tongue?


4 తంగేడునిప్పులతో కూడిన బాణములను

వాడిగల బాణములను నీమీద వేయును

Sharp arrows of the mighty, with coals of juniper.


5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను.

కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

Woe is me, that I sojourn in Mesech, that I dwell in the tents of Kedar!


6 కలహప్రియునియొద్ద

నేను చిరకాలము నివసించినవాడను.

My soul hath long dwelt with him that hateth peace.


7 నేను కోరునది సమాధానమే

అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

I am for peace: but when I speak, they are for war.

Friday, November 18, 2011

కీర్తనలు 119వ అధ్యాయము Psalms 119 (3)

(మేమ్‌)

97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది

దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.

O how I love thy law! it is my meditation all the day.

98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి.

నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.

Thou through thy commandments hast made me wiser than mine enemies: for they are ever with me.

99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను

కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

I have more understanding than all my teachers: for thy testimonies are my meditation.

100 నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను

కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.

I understand more than the ancients, because I keep thy precepts.

101 నేను నీ వాక్యము ననుసరించునట్లు

దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొల గించుకొనుచున్నాను

I have refrained my feet from every evil way, that I might keep thy word.

102 నీవు నాకు బోధించితివి గనుక

నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.

I have not departed from thy judgments: for thou hast taught me.

103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు

అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

How sweet are thy words unto my taste! yea, sweeter than honey to my mouth!

104 నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను

తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.

Through thy precepts I get understanding: therefore I hate every false way.

(నూన్‌)

105 నీ వాక్యము నా పాదములకు దీపమును

నా త్రోవకు వెలుగునై యున్నది.

Thy word is a lamp unto my feet, and a light unto my path.

106 నీ న్యాయవిధులను నేననుసరించెదనని

నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.

I have sworn, and I will perform it, that I will keep thy righteous judgments.

107 యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను

నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

I am afflicted very much: quicken me, O LORD, according unto thy word.

108 యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము.

నీ న్యాయవిధులను నాకు బోధింపుము

Accept, I beseech thee, the freewill offerings of my mouth, O LORD, and teach me thy judgments.

109 నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది.

అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.

My soul is continually in my hand: yet do I not forget thy law.

110 నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి

అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.

The wicked have laid a snare for me: yet I erred not from thy precepts.

111 నీ శాసనములు నాకు హృదయానందకరములు

అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

Thy testimonies have I taken as an heritage for ever: for they are the rejoicing of my heart.

112 నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను

ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.

I have inclined mine heart to perform thy statutes alway, even unto the end.

(సామెహ్‌)

113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను

నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

I hate vain thoughts: but thy law do I love.

114 నాకు మరుగుచోటు నా కేడెము నీవే

నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.

Thou art my hiding place and my shield: I hope in thy word.

115 నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను

దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.

Depart from me, ye evildoers: for I will keep the commandments of my God.

116 నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము

నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.

Uphold me according unto thy word, that I may live: and let me not be ashamed of my hope.

117 నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము

అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

Hold thou me up, and I shall be safe: and I will have respect unto thy statutes continually.

118 నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించుదువు

వారి కపటాలోచన మోసమే.

Thou hast trodden down all them that err from thy statutes: for their deceit is falsehood.

119 భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు

కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి

Thou puttest away all the wicked of the earth like dross: therefore I love thy testimonies.

120 నీ భయమువలన నా శరీరము వణకుచున్నది

నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

My flesh trembleth for fear of thee; and I am afraid of thy judgments.

(అయిన్‌)

121 నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను.

నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము.

I have done judgment and justice: leave me not to mine oppressors.

122 మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము

గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.

Be surety for thy servant for good: let not the proud oppress me.

123 నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి.

Mine eyes fail for thy salvation, and for the word of thy righteousness.

124 నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము

నీ కట్టడలను నాకు బోధింపుము

Deal with thy servant according unto thy mercy, and teach me thy statutes.

125 నేను నీ సేవకుడను

నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము

I am thy servant; give me understanding, that I may know thy testimonies.

126 జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు

యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.

It is time for thee, LORD, to work: for they have made void thy law.

127 బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.

Therefore I love thy commandments above gold; yea, above fine gold.

128 నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను

అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.

Therefore I esteem all thy precepts concerning all things to be right; and I hate every false way.

(పే)

129 నీ శాసనములు ఆశ్చర్యములు

కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.

Thy testimonies are wonderful: therefore doth my soul keep them.

130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును

అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును

The entrance of thy words giveth light; it giveth understanding unto the simple.

131 నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత

నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.

I opened my mouth, and panted: for I longed for thy commandments.

132 నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు

నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.

Look thou upon me, and be merciful unto me, as thou usest to do unto those that love thy name.

133 నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము

ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

Order my steps in thy word: and let not any iniquity have dominion over me.

134 నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు

మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచింపుము.

Deliver me from the oppression of man: so will I keep thy precepts.

135 నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము

నీ కట్టడలను నాకు బోధింపుము.

Make thy face to shine upon thy servant; and teach me thy statutes.

136 జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు

నా కన్నీరు ఏరులై పారుచున్నది.

Rivers of waters run down mine eyes, because they keep not thy law.

(సాదె)

137 యెహోవా, నీవు నీతిమంతుడవు

నీ న్యాయవిధులు యథార్థములు

Righteous art thou, O LORD, and upright are thy judgments.

138 నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు

నీ శాసనములను నీవు నియమించితివి.

Thy testimonies that thou hast commanded are righteous and very faithful.

139 నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు

కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.

My zeal hath consumed me, because mine enemies have forgotten thy words.

140 నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది

అది నీ సేవకునికి ప్రియమైనది.

Thy word is very pure: therefore thy servant loveth it.

141 నేను అల్పుడను నిరాకరింపబడినవాడను

అయినను నీ ఉపదేశములను నేను మరువను.

I am small and despised: yet do not I forget thy precepts.

142 నీ నీతి శాశ్వతమైనది

నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

Thy righteousness is an everlasting righteousness, and thy law is the truth.

143 శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి

అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి

Trouble and anguish have taken hold on me: yet thy commandments are my delights.

144 నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి

నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.

The righteousness of thy testimonies is everlasting: give me understanding, and I shall live.

(ఖొఫ్‌)

145 యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను

నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము.

I cried with my whole heart; hear me, O LORD: I will keep thy statutes.

146 నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను

నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.

I cried unto thee; save me, and I shall keep thy testimonies.

147 తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని

నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను

I prevented the dawning of the morning, and cried: I hoped in thy word.

148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై

నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును.

Mine eyes prevent the night watches, that I might meditate in thy word.

149 నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము

యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

Hear my voice according unto thy lovingkindness: O LORD, quicken me according to thy judgment.

150 దుష్కార్యములు చేయువారును

నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు

They draw nigh that follow after mischief: they are far from thy law.

151 యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు.

నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.

Thou art near, O LORD; and all thy commandments are truth.

152 నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని

నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.

Concerning thy testimonies, I have known of old that thou hast founded them for ever.

(రేష్‌)

153 నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను

నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము

Consider mine affliction, and deliver me: for I do not forget thy law.

154 నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము

నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

Plead my cause, and deliver me: quicken me according to thy word.

155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు

గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.

Salvation is far from the wicked: for they seek not thy statutes.

156 యెహోవా, నీ కనికరములు మితిలేనివి

నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.

Great are thy tender mercies, O LORD: quicken me according to thy judgments.

157 నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు

అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను.

Many are my persecutors and mine enemies; yet do I not decline from thy testimonies.

158 ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని

నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

I beheld the transgressors, and was grieved; because they kept not thy word.

159 యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు

నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము

Consider how I love thy precepts: quicken me, O LORD, according to thy loving kindness.

160 నీ వాక్య సారాంశము సత్యము

నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

Thy word is true from the beginning: and every one of thy righteous judgments endureth for ever.

(షీన్‌)

161 అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు

అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.

Princes have persecuted me without a cause: but my heart standeth in awe of thy word.

162 విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె

నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.

I rejoice at thy word, as one that findeth great spoil.

163 అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము

నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

I hate and abhor lying: but thy law do I love.

164 నీ న్యాయవిధులనుబట్టి

దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.

Seven times a day do I praise thee because of thy righteous judgments.

165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మదికలదు

వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు

Great peace have they which love thy law: and nothing shall offend them.

166 యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను

నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను.

LORD, I have hoped for thy salvation, and done thy commandments.

167 నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను

అవి నాకు అతి ప్రియములు,

My soul hath kept thy testimonies; and I love them exceedingly.

168 నా మార్గములన్నియు నీయెదుట నున్నవి

నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను.

I have kept thy precepts and thy testimonies: for all my ways are before thee.

(తౌ)

169 యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక

నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.

Let my cry come near before thee, O LORD: give me understanding according to thy word.

170 నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము

నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.

Let my supplication come before thee: deliver me according to thy word.

171 నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు

నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును

My lips shall utter praise, when thou hast taught me thy statutes.

172 నీ ఆజ్ఞలన్నియు న్యాయములు

నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.

My tongue shall speak of thy word: for all thy commandments are righteousness.

173 నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను

నీ చెయ్యి నాకు సహాయమగును గాక.

Let thine hand help me; for I have chosen thy precepts.

174 యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడు చున్నాను

నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.

I have longed for thy salvation, O LORD; and thy law is my delight.

175 నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను

నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక

Let my soul live, and it shall praise thee; and let thy judgments help me.

176 తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని

నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా

నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

I have gone astray like a lost sheep; seek thy servant; for I do not forget thy commandments.