1 యెహోవాయందు నమ్మిక యుంచువారు
కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
They that trust in the LORD shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.
2 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు
యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలచుట్టు ఉండును.
As the mountains are round about Jerusalem, so the LORD is round about his people from henceforth even for ever.
3 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు
భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.
For the rod of the wicked shall not rest upon the lot of the righteous; lest the righteous put forth their hands unto iniquity.
4 యెహోవా, మంచివారికి మేలు చేయుము
యథార్థహృదయులకు మేలు చేయుము.
Do good, O LORD, unto those that be good, and to them that are upright in their hearts.
5 తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని
పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును
ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
As for such as turn aside unto their crooked ways, the LORD shall lead them forth with the workers of iniquity: but peace shall be upon Israel.
No comments:
Post a Comment