Tuesday, November 29, 2011

కీర్తనలు 124వ అధ్యాయము Psalms 124

1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు
యెహోవా మనకు తోడైయుండనియెడల

If it had not been the LORD who was on our side, now may Israel say;

2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
If it had not been the LORD who was on our side, when men rose up against us:

3 యెహోవా మనకు తోడైయుండనియెడల
వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

Then they had swallowed us up quick, when their wrath was kindled against us:

4 జలములు మనలను ముంచివేసి యుండును
ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును

Then the waters had overwhelmed us, the stream had gone over our soul:

5 ప్రవాహములై ఘోషించు జలములు
మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

Then the proud waters had gone over our soul.

6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
Blessed be the LORD, who hath not given us as a prey to their teeth.

7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది
ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.

8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది.

Our help is in the name of the LORD, who made heaven and earth.

No comments: