1 యెహోవాయందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
Blessed is every one that feareth the LORD; that walketh in his ways.
2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు
నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
For thou shalt eat the labour of thine hands: happy shalt thou be, and it shall be well with thee.
3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును
నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
Thy wife shall be as a fruitful vine by the sides of thine house: thy children like olive plants round about thy table.
4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
Behold, that thus shall the man be blessed that feareth the LORD.
5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును
నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
The LORD shall bless thee out of Zion: and thou shalt see the good of Jerusalem all the days of thy life.
6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు.
ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
Yea, thou shalt see thy children's children, and peace upon Israel.
No comments:
Post a Comment