Thursday, December 22, 2011

కీర్తనలు 130వ అధ్యాయము

1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
Out of the depths have I cried unto thee, O LORD.

2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము.
నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

Lord, hear my voice: let thine ears be attentive to the voice of my supplications.

3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
If thou, LORD, shouldest mark iniquities, O Lord, who shall stand?

4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు
నీయొద్ద క్షమాపణ దొరుకును.

But there is forgiveness with thee, that thou mayest be feared.

5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను
నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

I wait for the LORD, my soul doth wait, and in his word do I hope.

6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా
నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా
నా ప్రాణము కనిపెట్టుచున్నది.

My soul waiteth for the Lord more than they that watch for the morning: I say, more than they that watch for the morning.

7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము
యెహోవాయొద్ద కృప దొరుకును.
ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

Let Israel hope in the LORD: for with the LORD there is mercy, and with him is plenteous redemption.

8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
And he shall redeem Israel from all his iniquities.

No comments: