దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదములో అనుకొందురు
వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు
మేలుచేయు వాడొకడునులేడు
2 వివేకముకలిగి దేవుని వెదకువారు కలరేమో అని
యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను
3. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు
మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మ్రింగునట్లు నా ప్రజలను మ్రింగుచు
పాపము చేయువారికందరికిని తెలివి లేదా!
పాపము చేయువారు బహుగా భయపడుదురు
5. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు
6. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు
అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు
7. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక.
యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
Thursday, September 24, 2009
కీర్తనలు 14వ అద్యాయము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment