Saturday, September 19, 2009

13వ అద్యాయము

1. .యెహోవా, ఎన్నాళ్ళవరకు నన్ను మరిచిపోవుదువు?
నిత్యము మరచెదవా?
నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?
ఎంతవరకు నా శత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
3. .యెహోవా, నా దేవా నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
4. నేను మరణనిద్ర నొందకుండను - వాని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండను
నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను
నా కన్నులకు వెలుగిమ్ము
5 నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను
నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు.

2 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

4. నేను మరణనిద్ర నొందకుండను - వాని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండను
నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను
నా కన్నులకు వెలుగిమ్ము

ఈ వాక్యాలు నా జీవిత గమనాన్ని మార్చివేసాయి
నేను మద్యపాన వ్యసనాన్ని మానే ప్రయత్నంలో కలిగిన వడిదుడుకుల మద్య ఈ వచనాలను నిరంతరం ద్యానం చేసాను

జాన్‌హైడ్ కనుమూరి said...

4. నేను మరణనిద్ర నొందకుండను - వాని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండను
నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను
నా కన్నులకు వెలుగిమ్ము

these line changed my life style