1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.
3. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును
అతడుచేయునదంతయు సఫలమగును
4. దుష్టులు ఆలాగున నుండక
గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు
5. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును
నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును
దుష్టుల మర్గము నాశనమునకు నడుపును.
No comments:
Post a Comment