Tuesday, March 18, 2008

కీర్తనలు 7వ అధ్యాయము

యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చియున్నాను
నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము
నన్ను తప్పించువాడెవడును లేకపోగా

2. వారు సింహమువలె ముకలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము

3. యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన యెడల

4 నాచేత పాపము జరిగిన యెడల
నాతో సమాధానముగా నుండువానికి నేను కీడుచేసినయెడల

5 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము
నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము
నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా

6. యెహొవా, కోపముతెచ్చుకొని లెమ్ము
నా విరోధుల ఆగ్రహము నణచుటకై మేల్కొనుము
న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా

7. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడు
వారికిపైగా పరమందు ఆశీనుడవుకమ్ము

8 యెహోవా జనములకు తీర్పుతీర్చువాడు
యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో
నాకు న్యాయముతీర్చుము

9 హృదయములను అంతరింద్రియములను
పరిశీలించు నీతిగలదేవా,

10 దుష్టుల చెడుతనము మానుపుము
నీతిగలవారిని స్థిరపరచుము
యథార్థ హృదయములను రక్షించు దేవుడే
నా కేడెము మోయువాడైయున్నాడు

11 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును
ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు

12 ఒకడు మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును
తన విల్లు ఎక్కుపెట్టి దానినిని సిద్ధపరచి యున్నాడు

13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు
తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు
చేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు

15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు
తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను

16 వాడు తలచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును
వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తిమీదనే పడును

17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

No comments: