Monday, June 13, 2011

కీర్తనలు 43వ అధ్యాయము Psalm 43

దేవా, నాకు న్యాయము తీర్చుము
భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము
కపటము కలిగి దౌర్జన్య చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు
Judge me, O God, and plead my cause against an ungodly nation: O deliver me from the deceitful and unjust man.

2 నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి?
నేను శత్రువుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేల?
For thou art the God of my strength: why dost thou cast me off? why go I mourning because of the oppression of the enemy?

3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము;
అవి నాకు త్రోవచూపును
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును
నన్ను తోడుకొని వచ్చును
O send out thy light and thy truth: let them lead me; let them bring me unto thy holy hill, and to thy tabernacles.

4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు
నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవునియొద్దకు చేరుదును
దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
Then will I go unto the altar of God, unto God my exceeding joy: yea, upon the harp will I praise thee, O God my God.

5 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?
నాలో నీవేల తొందరపడుచున్నావు?
దేవునియందు నిరీక్షణ యుంచుము,
ఆయనే నా రక్షణకర్త నా దేవుడు
ఇంకను నేనాయనను స్తుతించెదను
Why art thou cast down, O my soul? and why art thou disquieted within me? hope in God: for I shall yet praise him, who is the health of my countenance, and my God.

No comments: