అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదురన్నది నిజమా?
నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పుతీర్చుదురా?
Do ye indeed speak righteousness, O congregation? do ye judge uprightly, O ye sons of men?
2 లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు
దేశమందు మీచేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు
Yea, in heart ye work wickedness; ye weigh the violence of your hands in the earth.
3 తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరితబుద్ధి కలిగియుందురు
పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు
The wicked are estranged from the womb: they go astray as soon as they be born, speaking lies
4 వారి విషము నాగుపాము విషమువంటివి
Their poison is like the poison of a serpent: they are like the deaf adder that stoppeth her ear;
5 మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
వారి స్వరము తనకు వినబడకుండునట్లు
చెవి మూసికొనునట్టి చెవిటిపామువలె వారున్నారు
Which will not hearken to the voice of charmers, charming never so wisely.
6 దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము
యెహోవా,కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము
Break their teeth, O God, in their mouth: break out the great teeth of the young lions, O LORD.
7 పారు నీళ్ళవలె వారు గతించిపోవుదురు
అతడు తన బాణములను సంధింపగా
అవి తునాతునకలై పోవును
Let them melt away as waters which run continually: when he bendeth his bow to shoot his arrows, let them be as cut in pieces.
8 వారు కరిగిపోయిన నత్తవలె నుందురు
సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు
As a snail which melteth, let every one of them pass away: like the untimely birth of a woman, that they may not see the sun.
9 మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలకమునుపే
అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు
Before your pots can feel the thorns, he shall take them away as with a whirlwind, both living, and in his wrath.
10 ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు
భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు
The righteous shall rejoice when he seeth the vengeance: he shall wash his feet in the blood of the wicked.
11 కావున - నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు
నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
So that a man shall say, Verily there is a reward for the righteous: verily he is a God that judgeth in ది.
No comments:
Post a Comment