Wednesday, October 19, 2011

కీర్తనలు 93వ అధ్యాయము Psalms 93


1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు

ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు

యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు

కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.

The LORD reigneth, he is clothed with majesty; the LORD is clothed with strength, wherewith he hath girded himself: the world also is stablished, that it cannot be moved.

2 పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను

సదాకాలము ఉన్నవాడవు నీవే

Thy throne is established of old: thou art from everlasting.

3 వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను

వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి

The floods have lifted up, O LORD, the floods have lifted up their voice; the floods lift up their waves.

4 విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను

ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు

The LORD on high is mightier than the noise of many waters, yea, than the mighty waves of the sea.

5 నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు

యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.

Thy testimonies are very sure: holiness becometh thine house, O LORD, for ever.

No comments: