Thursday, November 3, 2011

కీర్తనలు 110వ అధ్యాయము Psalms 110


1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు

నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

The LORD said unto my Lord, Sit thou at my right hand, until I make thine enemies thy footstool.

2 యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు

నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

The LORD shall send the rod of thy strength out of Zion: rule thou in the midst of thine enemies.

3 యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు.

నీ ¸°వనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

Thy people shall be willing in the day of thy power, in the beauties of holiness from the womb of the morning: thou hast the dew of thy youth.

4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని

యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

The LORD hath sworn, and will not repent, Thou art a priest for ever after the order of Melchizedek.

5 ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి

తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

The Lord at thy right hand shall strike through kings in the day of his wrath.

6 అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును

దేశము శవములతో నిండియుండును

విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

He shall judge among the heathen, he shall fill the places with the dead bodies; he shall wound the heads over many countries.

7 మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

He shall drink of the brook in the way: therefore shall he lift up the head.

No comments: