Sunday, August 14, 2011
కీర్తనలు 61వ అధ్యాయము Psalm 61
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము
నా ప్రార్థనకు చెవియొగ్గుము
Hear my cry, O God; attend unto my prayer.
2 నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము
From the end of the earth will I cry unto thee, when my heart is overwhelmed: lead me to the rock that is higher than I.
3 నీవు నాకు ఆశ్రయముగా నుంటివి
శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
For thou hast been a shelter for me, and a strong tower from the enemy.
4 యుగయుగములు నేను నీ గుదారములో నివసించెదను
నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా)
I will abide in thy tabernacle for ever: I will trust in the covert of thy wings. Selah.
5 దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించియున్నావు
నీ నామమునందు భయభక్తులుగలవారికి స్వాస్థ్యము
నీవు నాకనుగ్రహించియున్నావు
For thou, O God, hast heard my vows: thou hast given me the heritage of those that fear thy name.
6 రాజునకు దీర్ఘాయు కలుగజేయుదువు గాక
అతని కాపాడుటకై, కృపాసత్యములను నియమించుము
Thou wilt prolong the king's life: and his years as many generations.
7 దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక
అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము
He shall abide before God for ever: O prepare mercy and truth, which may preserve him.
8 దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు
నీ నామమును నిత్యము కీర్తించెదను
So will I sing praise unto thy name for ever, that I may daily perform my vows.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment