Tuesday, August 16, 2011

కీర్తనలు 62వ అధ్యాయము Psalm 62

నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది
ఆయన వలన నాకు రక్షణ కలుగును
Truly my soul waiteth upon God: from him cometh my salvation.

2 ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తయిన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను
He only is my rock and my salvation; he is my defence; I shall not be greatly moved.

3 ఎన్నాళ్ళు మీరు ఒకనిపైబడుదురు?

ఒరుగుచున్న
గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరు ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు?

How long will ye imagine mischief against a man? ye shall be slain all of you: as a bowing wall shall ye be, and as a tottering fence.

4 అతని ఔనత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు
అబద్ధమాడుట వారికి సంతోషము

వారు తమనోటితో శుభవనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు (సెలా)

They only consult to cast him down from his excellency: they delight in lies: they bless with their mouth, but they curse inwardly. Selah.

5 నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము
ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది

My soul, wait thou only upon God; for my expectation is from him.


6 ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము
నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదిలింపబడను
He only is my rock and my salvation: he is my defence; I shall not be moved.

7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము
నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది
In God is my salvation and my glory: the rock of my strength, and my refuge, is in God.

8 జనులారా, యెల్లప్పుడు మీ ఆయనయందు నమ్మిక యుంచుడి
ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి
దేవుడు మనకు ఆశ్రయము(సెలా)

Trust in him at all times; ye people, pour out your heart before him: God is a refuge for us. Selah.

9 అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు
ఘనులైనవారు మాయస్వరూపులు
త్రాసులో వారందరు తేలిపోవుదురు
వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

Surely men of low degree are vanity, and men of high degree are a lie: to be laid in the balance, they are altogether lighter than vanity.


10 బలత్కారమందు నమ్మికయుంచకుడి
దోచుకొనుటచేత గర్వపడకుడి
ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి
Trust not in oppression, and become not vain in robbery: if riches increase, set not your heart upon them.

11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను

రెండుమారులు ఆ మాట నాకు వినబడెను

God hath spoken once; twice have I heard this; that power belongeth unto God.


12 ప్రభువా, మనుష్యులందరికి వారి వారి క్రియలచొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు
కాగా కృపచూపుటయు నీది

Also unto thee, O Lord, belongeth mercy: for thou renderest to every man according to his work.

No comments: