1 సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
Make a joyful noise unto the LORD, all ye lands.
2 సంతోషముతో యెహోవాను సేవించుడి
ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
Serve the LORD with gladness: come before his presence with singing.
3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము
మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
Know ye that the LORD he is God: it is he that hath made us, and not we ourselves; we are his people, and the sheep of his pasture.
4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి
కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి
ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
Enter into his gates with thanksgiving, and into his courts with praise: be thankful unto him, and bless his name.
5 యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును
ఆయన సత్యము తరతరములుండును.
For the LORD is good; his mercy is everlasting; and his truth endureth to all generations.
No comments:
Post a Comment