Wednesday, October 26, 2011

కీర్తనలు 101వ అధ్యాయము Psalms 101


1 నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను

యెహోవా, నిన్ను కీర్తించెదను.

I will sing of mercy and judgment: unto thee, O LORD, will I sing.

2 నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను.

నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు?

నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును

2 I will behave myself wisely in a perfect way. O when wilt thou come unto me? I will walk within my house with a perfect heart.

3 నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను

భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను

I will set no wicked thing before mine eyes: I hate the work of them that turn aside; it shall not cleave to me.

4 మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను

దౌష్ట్యమును నేననుసరింపను.

A froward heart shall depart from me: I will not know a wicked person.

5 తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను

అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను

Whoso privily slandereth his neighbour, him will I cut off: him that hath an high look and a proud heart will not I suffer.

6 నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.

Mine eyes shall be upon the faithful of the land, that they may dwell with me: he that walketh in a perfect way, he shall serve me.

7 మోసము చేయువాడు నా యింట నివసింపరాదు

అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

He that worketh deceit shall not dwell within my house: he that telleth lies shall not tarry in my sight.

8 యెహోవా పట్టణములోనుండి

పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై

దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.

I will early destroy all the wicked of the land; that I may cut off all wicked doers from the city of the LORD.

No comments: