1 యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు
చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
Lord, thou hast been favourable unto thy land: thou hast brought back the captivity of Jacob.
2 నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు
వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
Thou hast forgiven the iniquity of thy people, thou hast covered all their sin. Selah.
3 నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు
నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు
Thou hast taken away all thy wrath: thou hast turned thyself from the fierceness of thine anger.
4 మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.
మా మీదనున్న నీ కోపము చాలించుము.
Turn us, O God of our salvation, and cause thine anger toward us to cease.
5 ఎల్లకాలము మామీద కోపగించెదవా?
తరతరములు నీ కోపము సాగించెదవా?
Wilt thou be angry with us for ever? wilt thou draw out thine anger to all generations?
6 నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు
నీవు మరల మమ్మును బ్రదికింపవా?
Wilt thou not revive us again: that thy people may rejoice in thee?
7 యెహోవా, నీ కృప మాకు కనుపరచుము
నీ రక్షణ మాకు దయచేయుము.
Shew us thy mercy, O LORD, and grant us thy salvation.
8 దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను
ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును
వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
I will hear what God the LORD will speak: for he will speak peace unto his people, and to his saints: but let them not turn again to folly.
9 మన దేశములో మహిమ నివసించునట్లు
ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
Surely his salvation is nigh them that fear him; that glory may dwell in our land.
10 కృపాసత్యములు కలిసికొనినవి
నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.
Mercy and truth are met together; righteousness and peace have kissed each other.
11 భూమిలోనుండి సత్యము మొలుచును
ఆకాశములోనుండి నీతి పారజూచును.
Truth shall spring out of the earth; and righteousness shall look down from heaven.
12 యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును
మన భూమి దాని ఫలమునిచ్చును.
Yea, the LORD shall give that which is good; and our land shall yield her increase.
13 నీతి ఆయనకు ముందు నడచును
ఆయన అడుగుజాడలలో అది నడచును.
Righteousness shall go before him; and shall set us in the way of his steps.
No comments:
Post a Comment