1 యెహోవా, నేను దీనుడను దరిద్రుడను
చెవియొగ్గి నాకుత్తరమిమ్ము
Bow down thine ear, O LORD, hear me: for I am poor and needy.
2 నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము.
నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.
Preserve my soul; for I am holy: O thou my God, save thy servant that trusteth in thee.
3 ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నన్ను కరుణింపుము
Be merciful unto me, O Lord: for I cry unto thee daily.
4 ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను
నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.
Rejoice the soul of thy servant: for unto thee, O Lord, do I lift up my soul.
5 ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు
నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.
For thou, Lord, art good, and ready to forgive; and plenteous in mercy unto all them that call upon thee.
6 యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము
నా మనవుల ధ్వని ఆలకింపుము,
Give ear, O LORD, unto my prayer; and attend to the voice of my supplications.
7 నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు
గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టెదను.
In the day of my trouble I will call upon thee: for thou wilt answer me.
8 ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు
నీవే అద్వితీయ దేవుడవు.
Among the gods there is none like unto thee, O Lord; neither are there any works like unto thy works.
9 ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు
నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.
All nations whom thou hast made shall come and worship before thee, O Lord; and shall glorify thy name.
10 నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు
నీ నామమును ఘనపరచుదురు
For thou art great, and doest wondrous things: thou art God alone.
11 యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము.
నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
Teach me thy way, O LORD; I will walk in thy truth: unite my heart to fear thy name.
12 నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను
నీ నామమును నిత్యము మహిమపరచెదను.
I will praise thee, O Lord my God, with all my heart: and I will glorify thy name for evermore.
13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది
పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
For great is thy mercy toward me: and thou hast delivered my soul from the lowest hell.
14 దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు
బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు
వారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.
O God, the proud are risen against me, and the assemblies of violent men have sought after my soul; and have not set thee before them.
15 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు
ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు
But thou, O Lord, art a God full of compassion, and gracious, longsuffering, and plenteous in mercy and truth.
16 నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము
నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము
నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.
O turn unto me, and have mercy upon me; give thy strength unto thy servant, and save the son of thine handmaid.
17 యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు
నా పగవారు చూచి సిగ్గుపడునట్లు
శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.
Shew me a token for good; that they which hate me may see it, and be ashamed: because thou, LORD, hast holpen me, and comforted me.
No comments:
Post a Comment