1 రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము
మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
O come, let us sing unto the LORD: let us make a joyful noise to the rock of our salvation.
2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము
కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
Let us come before his presence with thanksgiving, and make a joyful noise unto him with psalms.
3 యెహోవా మహా దేవుడు
దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
For the LORD is a great God, and a great King above all gods.
4 భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి
పర్వతశిఖరములు ఆయనవే.
In his hand are the deep places of the earth: the strength of the hills is his also.
5 సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను
ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
The sea is his, and he made it: and his hands formed the dry land.
6 ఆయన మన దేవుడు
మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
O come, let us worship and bow down: let us kneel before the LORD our maker.
7 రండి నమస్కారము చేసి సాగిలపడుదము
మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము
నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
For he is our God; and we are the people of his pasture, and the sheep of his hand. To day if ye will hear his voice,
8 అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొనినట్లు
మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు
మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
Harden not your heart, as in the provocation, and as in the day of temptation in the wilderness:
9 అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
When your fathers tempted me, proved me, and saw my work.
10 నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి
వారు హృదయమున తప్పిపోవు ప్రజలు
వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
Forty years long was I grieved with this generation, and said, It is a people that do err in their heart, and they have not known my ways:
11 కావున నేను కోపించి - వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.
Unto whom I sware in my wrath that they should not enter into my rest.
No comments:
Post a Comment