Friday, October 21, 2011
కీర్తనలు 96వ అధ్యాయము Psalms 96
1 యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి
O sing unto the LORD a new song: sing unto the LORD, all the earth.
2 యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి
అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.
Sing unto the LORD, bless his name; shew forth his salvation from day to day.
3 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి
సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి
Declare his glory among the heathen, his wonders among all people.
4 యెహోవా మహాత్మ్యముగలవాడు
ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు
సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
For the LORD is great, and greatly to be praised: he is to be feared above all gods.
5 జనముల దేవతలందరు వట్టి విగ్రహములే
యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.
For all the gods of the nations are idols: but the LORD made the heavens.
6 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి
బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.
Honour and majesty are before him: strength and beauty are in his sanctuary.
7 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి
మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.
Give unto the LORD, O ye kindreds of the people, give unto the LORD glory and strength.
8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి
నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.
Give unto the LORD the glory due unto his name: bring an offering, and come into his courts.
9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి
సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
O worship the LORD in the beauty of holiness: fear before him, all the earth.
10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు
లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది
న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును.
ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి
Say among the heathen that the LORD reigneth: the world also shall be established that it shall not be moved: he shall judge the people righteously.
11 యెహోవా వేంచేయుచున్నాడు
ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.
Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fulness thereof.
12 పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక.
వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
Let the field be joyful, and all that is therein: then shall all the trees of the wood rejoice
13 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు
న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
Before the LORD: for he cometh, for he cometh to judge the earth: he shall judge the world with righteousness, and the people with his truth.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment