Sunday, October 23, 2011

కీర్తనలు 98వ అధ్యాయము Psalms 98


1 యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు

ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి

ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు

ఆయనకు విజయము కలుగజేసియున్నది.

O sing unto the LORD a new song; for he hath done marvellous things: his right hand, and his holy arm, hath gotten him the victory.

2 యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు

అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.

The LORD hath made known his salvation: his righteousness hath he openly shewed in the sight of the heathen.

3 ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.

He hath remembered his mercy and his truth toward the house of Israel: all the ends of the earth have seen the salvation of our God.

4 సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి

ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.

Make a joyful noise unto the LORD, all the earth: make a loud noise, and rejoice, and sing praise.

5 సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి

సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.

Sing unto the LORD with the harp; with the harp, and the voice of a psalm.

6 బూరలతోను కొమ్ముల నాదముతోను

రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.

With trumpets and sound of cornet make a joyful noise before the LORD, the King.

7 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక

లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.

7 Let the sea roar, and the fulness thereof; the world, and they that dwell therein.

8 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక

కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.

Let the floods clap their hands: let the hills be joyful together

9 భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై

న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

Before the LORD; for he cometh to judge the earth: with righteousness shall he judge the world, and the people with equity.

No comments: