1 యెహోవాను స్తుతించుడి
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి.
యెహోవా నామమును స్తుతించుడి.
Praise ye the LORD. Praise, O ye servants of the LORD, praise the name of the LORD.
2 ఇది మొదలుకొని యెల్లకాలము
యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
Blessed be the name of the LORD from this time forth and for evermore.
3 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు
యెహోవా నామము స్తుతి నొందదగినది.
From the rising of the sun unto the going down of the same the LORD's name is to be praised.
4 యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు
ఆయన మహిమవిశాలమున ఆకాశ వ్యాపించి యున్నది
The LORD is high above all nations, and his glory above the heavens.
5 ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?
Who is like unto the LORD our God, who dwelleth on high,
6 ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
Who humbleth himself to behold the things that are in heaven, and in the earth!
7 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
He raiseth up the poor out of the dust, and lifteth the needy out of the dunghill;
8 ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు
పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
That he may set him with princes, even with the princes of his people.
9 ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను
కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.
యెహోవాను స్తుతించుడి.
He maketh the barren woman to keep house, and to be a joyful mother of children. Praise ye the LORD.
No comments:
Post a Comment