1 ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు
అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు
When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language;
2 యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను
ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.
Judah was his sanctuary, and Israel his dominion.
3 సముద్రము దానిని చూచి పారిపోయెను
యొర్దాను నది వెనుకకు మళ్లెను.
The sea saw it, and fled: Jordan was driven back.
4 కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను.
The mountains skipped like rams, and the little hills like lambs.
5 సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది?
యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?
What ailed thee, O thou sea, that thou fleddest? thou Jordan, that thou wast driven back?
6 కొండలారా, మీరు పొట్లేళ్లవలెను
గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది?
Ye mountains, that ye skipped like rams; and ye little hills, like lambs?
7 భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
Tremble, thou earth, at the presence of the Lord, at the presence of the God of Jacob;
8 ఆయన బండను నీటిమడుగుగాను
చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు.
Which turned the rock into a standing water, the flint into a fountain of waters.
No comments:
Post a Comment