Sunday, November 13, 2011

కీర్తనలు 119వ అధ్యాయము, Psalms119(1)

(ఆలెఫ్‌)

యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి

నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు

Blessed are the undefiled in the way, who walk in the law of the LORD.


2 ఆయన శాసనములను గైకొనుచు

పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.

Blessed are they that keep his testimonies, and that seek him with the whole heart.


3 వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు

They also do no iniquity: they walk in his ways.


4 నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని .

నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.

Thou hast commanded us to keep thy precepts diligently.


5 ఆహా నీ కట్టడలను గైకొనునట్లు

నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.

O that my ways were directed to keep thy statutes!


6 నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు

నాకు అవమానము కలుగనేరదు.

Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.


7 నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు

యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

I will praise thee with uprightness of heart, when I shall have learned thy righteous judgments.

8 నీ కట్టడలను నేను గైకొందును

నన్ను బొత్తిగా విడనాడకుము.

I will keep thy statutes: O forsake me not utterly.

(బేత్‌)

9 యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?

నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?

Wherewithal shall a young man cleanse his way? by taking heed thereto according to thy word.

10 నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను

నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.

With my whole heart have I sought thee: O let me not wander from thy commandments.


11 నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు

నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

Thy word have I hid in mine heart, that I might not sin against thee.


12 యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు

నీ కట్టడలను నాకు బోధించుము.

Blessed art thou, O LORD: teach me thy statutes.


13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని

నా పెదవులతో వివరించుదును.

With my lips have I declared all the judgments of thy mouth.


14 సర్వసంపదలు దొరికినట్లు

నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.

I have rejoiced in the way of thy testimonies, as much as in all riches.


15 నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను

నీ త్రోవలను మన్నించెదను.

I will meditate in thy precepts, and have respect unto thy ways.


16 నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను.

నీ వాక్యమును నేను మరువకయుందును.

I will delight myself in thy statutes: I will not forget thy word.

(గీమెల్‌

17 నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము

నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.

Deal bountifully with thy servant, that I may live, and keep thy word.


18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.

Open thou mine eyes, that I may behold wondrous things out of thy law.


19 నేను భూమిమీద పరదేశినై యున్నాను

నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.

I am a stranger in the earth: hide not thy commandments from me.


20 నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది

దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.

My soul breaketh for the longing that it hath unto thy judgments at all times.


21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు.

నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.

Thou hast rebuked the proud that are cursed, which do err from thy commandments.


22 నేను నీ శాసనముల ననుసరించుచున్నాను.

నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము.

Remove from me reproach and contempt; for I have kept thy testimonies.


23 అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు

నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.

Princes also did sit and speak against me: but thy servant did meditate in thy statutes.


24 నీ శాసనములు నాకు సంతోషకరములు

అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

Thy testimonies also are my delight and my counsellors.

(దాలెత్‌)

25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది

నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.

My soul cleaveth unto the dust: quicken thou me according to thy word.


26 నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి

నీ కట్టడలను నాకు బోధింపుము

I have declared my ways, and thou heardest me: teach me thy statutes.


27 నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము.

నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

Make me to understand the way of thy precepts: so shall I talk of thy wondrous works.


28 వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను

నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.

My soul melteth for heaviness: strengthen thou me according unto thy word.


29 కపటపు నడత నాకు దూరము చేయుము

నీ ఉపదేశమును నాకు దయచేయుము

Remove from me the way of lying: and grant me thy law graciously.


30 సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను

నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొనియున్నాను

I have chosen the way of truth: thy judgments have I laid before me.


31 యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.

I have stuck unto thy testimonies: O LORD, put me not to shame.


32 నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.

I will run the way of thy commandments, when thou shalt enlarge my heart.

(హే)

33 యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము.

అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.

Teach me, O LORD, the way of thy statutes; and I shall keep it unto the end.


34 నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము

అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును.

Give me understanding, and I shall keep thy law; yea, I shall observe it with my whole heart.


35 నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను

దానియందు నన్ను నడువజేయుము.

Make me to go in the path of thy commandments; for therein do I delight.


36 లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.

Incline my heart unto thy testimonies, and not to covetousness.


37 వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము

నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.

Turn away mine eyes from beholding vanity; and quicken thou me in thy way.


38 నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది

నీ సేవకునికి దాని స్థిరపరచుము.

Stablish thy word unto thy servant, who is devoted to thy fear.


39 నీ న్యాయవిధులు ఉత్తములు

నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.

Turn away my reproach which I fear: for thy judgments are good.


40 నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు

నన్ను బ్రదికింపుము.

Behold, I have longed after thy precepts: quicken me in thy righteousness.

(వావ్‌)

41 యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము

నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.

Let thy mercies come also unto me, O LORD, even thy salvation, according to thy word.


42 అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.

So shall I have wherewith to answer him that reproacheth me: for I trust in thy word.


43 నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము

నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.

And take not the word of truth utterly out of my mouth; for I have hoped in thy judgments.


44 నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును

నేను నిత్యము దాని ననుసరించుదును

So shall I keep thy law continually for ever and ever.


45 నేను నీ ఉపదేశములను వెదకువాడను

నిర్బంధములేక నడుచుకొందును

And I will walk at liberty: for I seek thy precepts.


46 సిగ్గుపడక రాజులయెదుట

నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.

I will speak of thy testimonies also before kings, and will not be ashamed.


47 నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను

అవి నాకు ప్రియములు.

And I will delight myself in thy commandments, which I have loved.


48 నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను

నీ కట్టడలను నేను ధ్యానించుదును.

My hands also will I lift up unto thy commandments, which I have loved; and I will meditate in thy statutes.

No comments: