Friday, November 18, 2011

కీర్తనలు 119వ అధ్యాయము - Psalms119(2

(జాయిన్‌)

49 నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము

దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.

Remember the word unto thy servant, upon which thou hast caused me to hope.

50 నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది

నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

This is my comfort in my affliction: for thy word hath quickened me.

51 గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి

అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను.

The proud have had me greatly in derision: yet have I not declined from thy law.

52 యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని

నేను ఓదార్పు నొందితిని.

I remembered thy judgments of old, O LORD; and have comforted myself.

53 నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా

నాకు అధిక రోషము పుట్టుచున్నది

Horror hath taken hold upon me because of the wicked that forsake thy law.

54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు

నీ కట్టడలు హేతువులాయెను.

Thy statutes have been my songs in the house of my pilgrimage.

55 యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను

నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను

I have remembered thy name, O LORD, in the night, and have kept thy law.

56 నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను

ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.

This I had, because I kept thy precepts.

(హేత్‌)

57 యెహోవా, నీవే నా భాగము

నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.

Thou art my portion, O LORD: I have said that I would keep thy words.

58 కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను

నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.

I intreated thy favour with my whole heart: be merciful unto me according to thy word.

59 నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని

నీ శాసనములతట్టు మరలుకొంటిని.

I thought on my ways, and turned my feet unto thy testimonies.

60 నీ ఆజ్ఞలను అనుసరించుటకు

నేను జాగుచేయక త్వరపడితిని.

I made haste, and delayed not to keep thy commandments.

61 భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను

నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు

The bands of the wicked have robbed me: but I have not forgotten thy law.

62 న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు

అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

At midnight I will rise to give thanks unto thee because of thy righteous judgments.

63 నీయందు భయభక్తులు గలవారందరికిని

నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను.

I am a companion of all them that fear thee, and of them that keep thy precepts.

64 యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది

నీ కట్టడలను నాకు బోధింపుము.

The earth, O LORD, is full of thy mercy: teach me thy statutes.

తే­త్‌

65 యెహోవా, నీ మాట చొప్పున

నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.

Thou hast dealt well with thy servant, O LORD, according unto thy word.

66 నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను

మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.

Teach me good judgment and knowledge: for I have believed thy commandments.

67 శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని

ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.

Before I was afflicted I went astray: but now have I kept thy word.

68 నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు

నీ కట్టడలను నాకు బోధింపుము.

Thou art good, and doest good; teach me thy statutes.

69 గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు

అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును.

The proud have forged a lie against me: but I will keep thy precepts with my whole heart.

70 వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది

నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.

Their heart is as fat as grease; but I delight in thy law.

71 నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు

శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.

It is good for me that I have been afflicted; that I might learn thy statutes.

72 వేలకొలది వెండి బంగారు నాణములకంటె

నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

The law of thy mouth is better unto me than thousands of gold and silver.

యోద్‌

73నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను

నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయచేయుము.

Thy hands have made me and fashioned me: give me understanding, that I may learn thy commandments.

74 నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను

నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతోషింతురు

They that fear thee will be glad when they see me; because I have hoped in thy word.

75 యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు

విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.

I know, O LORD, that thy judgments are right, and that thou in faithfulness hast afflicted me.

76 నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున

నీ కృప నన్ను ఆదరించును గాక.

Let, I pray thee, thy merciful kindness be for my comfort, according to thy word unto thy servant.

77 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.

నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.

Let thy tender mercies come unto me, that I may live: for thy law is my delight.

78 నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను.

గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.

Let the proud be ashamed; for they dealt perversely with me without a cause: but I will meditate in thy precepts.

79 నీయందు భయభక్తులుగలవారును

నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.

Let those that fear thee turn unto me, and those that have known thy testimonies.

80 నేను సిగ్గుపడకుండునట్లు

నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.

Let my heart be sound in thy statutes; that I be not ashamed.

..కఫ్‌

81 నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది.

నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను

My soul fainteth for thy salvation: but I hope in thy word.

82 నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని

నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి

Mine eyes fail for thy word, saying, When wilt thou comfort me?

83 నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని

అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.

For I am become like a bottle in the smoke; yet do I not forget thy statutes.

84 నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను?

నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?

How many are the days of thy servant? when wilt thou execute judgment on them that persecute me?

85 నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు

నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.

The proud have digged pits for me, which are not after thy law.

86 నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి

పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు

నాకు సహాయముచేయుము.

All thy commandments are faithful: they persecute me wrongfully; help thou me.

87 భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను

అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.

They had almost consumed me upon earth; but I forsook not thy precepts.

88 నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు

నీ కృపచేత నన్ను బ్రదికింపుము.

Quicken me after thy lovingkindness; so shall I keep the testimony of thy mouth.

లామెద్‌.

89 యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.

For ever, O LORD, thy word is settled in heaven.

90 నీ విశ్వాస్యత తరతరములుండును.

నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది

90 Thy faithfulness is unto all generations: thou hast established the earth, and it abideth.

91 సమస్తము నీకు సేవచేయుచున్నవి

కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి

They continue this day according to thine ordinances: for all are thy servants.

92 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల

నా శ్రమయందు నేను నశించియుందును.

Unless thy law had been my delights, I should then have perished in mine affliction.

93 నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి

నేనెన్నడును వాటిని మరువను.

I will never forget thy precepts: for with them thou hast quickened me.

94 నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను

నేను నీవాడనే నన్ను రక్షించుము.

I am thine, save me: for I have sought thy precepts.

95 నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు

అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.

The wicked have waited for me to destroy me: but I will consider thy testimonies.

96 సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను

నీ ధర్మోపదేశము అపరిమితమైనది.

I have seen an end of all perfection: but thy commandment is exceeding broad.

............................ఇంకా వుంది

No comments: